PM Modi-Sharad Pawar: గడ్కరీతో విందు.. ప్రధాని మోడీతో భేటీ.. మహా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..
ఇటీవల దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తోన్న విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్..
ఇటీవల దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తోన్న విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) బీజేపీ అగ్రనేతలను కలుస్తుండటం సంచలనంగా మారుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) జప్తు చేసిన రోజే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో విందులో పాల్గొన్నారు శరద్ పవార్. అంతే కాదు ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ విందు కార్యక్రమానికి రౌత్‌తో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మంగళవారం ఈ పరిణామాలు జరగ్గా.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు శరద్ పవార్. పార్లమెంటులో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ఈ భేటీ అవడం సంచలనంగా మారింది.
Nationalist Congress Party (NCP) chief Sharad Pawar met Prime Minister Narendra Modi today in Parliament.
(File photos) pic.twitter.com/joQQJGvuXQ
— ANI (@ANI) April 6, 2022
మోదీతో భేటీ అనంతరం పవార్ మీడియాతో మాట్లాడుతూ.. రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు పూర్తి బాధ్యత కూడా వాళ్లదే అని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న రౌత్‌ను ఈడీ లక్ష్యంగా చేసుకుందని పవార్ ఆరోపించారు.
The Maha Vikas Aghadi (MVA) will come back to power after the next assembly elections in Maharashtra: NCP Chief Sharad Pawar pic.twitter.com/MMPolx65oD
— ANI (@ANI) April 6, 2022
మరోవైపు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని పవర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు ఇతరులను పట్టించుకోకుండా పక్కనపెడుతున్నారు అనే భావన రాకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత పూర్తిగా వారిదే అని అన్నారు. అయితే తాము(మహావికాస్ అఘాడీ) భేటీ అయినప్పుడు ఇలాంటి విషయాలు ఏవీ ప్రస్తావనకు రాలేదని పవార్ స్పష్టం చేశారు. అలాగే యూపీఏను ముందుడి నడిపిస్తారా అని ప్రశ్నించగా.. తనకు ఆసక్తి లేదని చెప్పారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే ప్రధానితో అంత సమయం భేటీ కావడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.
ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ అరెస్ట్.. మంత్రి కేటీఆర్ సూచనతో స్పందించిన పోలీసులు
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..
Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..