AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast Movie: ప్రమోషన్స్‌తో పనిలేదు అంటున్న దళపతి.. బీస్ట్‌ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం సౌత్ సర్కిల్స్‌లో బీస్ట్(Beast) మేనియా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. చిత్రయూనిట్ పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా... ఒక్కో అప్‌డేట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దళపతి ఫ్యాన్స్.

Beast Movie: ప్రమోషన్స్‌తో పనిలేదు అంటున్న దళపతి.. బీస్ట్‌ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్న ఫ్యాన్స్
Beast
Rajeev Rayala
|

Updated on: Apr 07, 2022 | 8:06 AM

Share

ప్రస్తుతం సౌత్ సర్కిల్స్‌లో బీస్ట్(Beast) మేనియా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. చిత్రయూనిట్ పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా… ఒక్కో అప్‌డేట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దళపతి ఫ్యాన్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్‌ను కూడా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో సత్తా చాటుతున్నారు. మాస్టర్ సినిమాతో కోవిడ్ టైమ్‌లోనూ సూపర్ హిట్ అందుకున్న విజయ్‌.. బీస్ట్ సినిమాతో మరోసారి బెత్తం చేతికి తీసుకున్నారు. వరుణ్‌ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా రిలీజ్ అయినా.. ప్రమోషన్ విషయంలో తమిళ ఇండస్ట్రీకే పరిమితమైంది బీస్ట్‌ టీమ్‌. ఇంకా చెప్పాలంటే అసలు ఓపెన్‌ ప్రమోషన్‌ జోలికే పోవట్లేదు నెల్సన్ అండ్ కంపెనీ.

షూటింగ్ ప్రారంభమైన చాలా కాలానికి టైటిల్‌ పోస్టర్ రివీల్ చేశారు. తరువాత రెండు సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ప్రీ-టీజర్, టీజర్ లాంటి అప్‌డేట్స్‌కు ఛాన్స్ ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా డైరెక్ట్‌గా ట్రయిలర్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ట్రైలర్‌ లాంచ్‌ను కూడా ఎలాంటి ఈవెంట్‌ లేకుండా సైలెంట్‌గా ఆన్‌లైన్‌లో వదిలేశారు. ఇలా ప్రమోషన్‌ని లైట్ తీస్కున్న బీస్ట్‌ యూనిట్‌ తీరుతో దళపతి ఫ్యాన్స్‌ హర్ట్ అవుతున్నారు. రిలీజ్ స్టయిల్‌ ఎలా ఉన్నా.. ట్రైలర్ కంటెంట్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. దళపతి నుంచి ఫ్యాన్స్ ఎలాంటి మాస్ మసాలా కంటెంట్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తారో.. పర్ఫెక్ట్‌గా అలాంటి సినిమాను సిద్ధం చేశారు నెల్సన్ దిలీప్‌. యాక్షన్‌తో పాటు కామెడీ, రొమాన్స్‌, డ్రామా ఇలా ఏ ఒక్క ఎలిమెంట్ కూడా మిస్‌ అవ్వకుండా పవర్‌ ప్యాక్డ్ గా బీస్ట్ సినిమాను సిద్దం చేశారు. అందుకే రిలీజ్ విషయంలోనూ కేజీఎఫ్ 2 లాంటి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మూవీతో పోటీకి సై అంటోంది బీస్ట్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్