Hari Hara Veera Mallu: శరవేగంగా పవర్ స్టార్ మూవీ షూటింగ్.. ‘హరిహర వీరమల్లు’ లేటెస్ట్ ఆప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇచ్చి రెండు సూపర్ హిట్స్ తు తన కథలో వేసుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా పవన్ కు పర్ఫెక్ట్ రీఎంట్రీగా నిలిచిన విషయం తెలిసిందే..

Hari Hara Veera Mallu: శరవేగంగా పవర్ స్టార్ మూవీ షూటింగ్.. 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ ఆప్డేట్
Power Star Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 07, 2022 | 7:49 AM

పవర్ స్టార్(Power Star) పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇచ్చి రెండు సూపర్ హిట్స్ తు తన కథలో వేసుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా పవన్ కు పర్ఫెక్ట్ రీఎంట్రీగా నిలిచిన విషయం తెలిసిందే.. దాదాపు మూడేళ్ళ తర్వాత తెరపై పవన్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక రీసెంట్ గా వచ్చిన భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమా కూడా అంటే యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన బీమ్లానాయక్ సినిమా పవన్ ఫ్యాన్స్ కు కావాల్సినంత జోష్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ , రానా కలిసి నటించిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది. దాంతో ఇప్పుడు పవన్ నుంచి హ్యాట్రిక్ హిట్ ను ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక పవన్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

ఫిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్ మొదటి నుంచి వినిపిస్తుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండిస్ కీలక పాత్రలో నటిస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టిన పవన్.. శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేయనున్నారట. ఈ నెల 8వ తేదీన కొత్త షెడ్యూల్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్ర  పోషిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథతో ఆయన ‘హరి హర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నారు క్రిష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’