Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..

Ghani Action Trailer: వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 8న (శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్..

Ghani Action Trailer: 'నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా'.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..
Ghani Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 07, 2022 | 11:35 AM

Ghani Action Trailer: వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 8న (శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో మొదలైన ఈ జోరు వరుస ఇంటర్వ్యూలతో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను విడుదల చేసింది. గని యాక్షన్‌ ట్రైలర్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ట్రైలర్‌లో పేరుకు తగ్గట్లుగానే యాక్షన్‌ సన్నివేశాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్‌లు సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేశాయని చెప్పాలి.

ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ చెప్పే.. ‘జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. వాట‌న్నింటికీ స‌మాధానం ఒక్కటే. రాసిపెట్టుకో నా ప్రతీ గెలుపుతో నీకు భయంపుట్టేలా చేస్తా’ అని చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక ‘ఆ రోజు నువ్వు ట‌చ్ చేసింది న‌న్ను కాదు.. నా ఈగోని’ అని న‌వీన్ చంద్ర చెప్పే డైలాగ్‌ హీరో, విలన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉండనున్నాయో చెప్పకనే చెప్పేసింది. జగపతి బాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర పాత్రలు చాలా పవర్‌ ఫుల్‌గా కనిపిస్తున్నాయి.

దీంతో ఈ ట్రైలర్‌ చూసిన వరుణ్‌ ఫ్యాన్స్‌ కచ్చితంగా సినిమా సూపర్‌ హిట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాను పవన్‌ కళ్యాన్‌ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రంతో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: CNG Price Hike: భారీగా పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోకు రూ.2.50 చొప్పున పెంపు..

Free Charging: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్.. ఉచితంగా EV ఛార్జింగ్ చేసుకోవచ్చని ప్రకటన..

Beast: దళపతి విజయ్‌ సినిమాపై బాలీవుడ్‌ బాద్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!