AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CNG Price Hike: భారీగా పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోకు రూ.2.50 చొప్పున పెంపు..

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీ( CNG ) ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి...

CNG Price Hike: భారీగా పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోకు రూ.2.50 చొప్పున పెంపు..
Cng
Srinivas Chekkilla
|

Updated on: Apr 07, 2022 | 9:16 AM

Share

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీ( CNG ) ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఈరోజు ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.69.11కి పెరిగింది. గత 2 రోజుల్లో, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) సీఎన్‌జీ ధరలను కిలోకు రూ. 5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో ఇది మూడో పెంపు కాగా ఈ నెలలో మొత్తం కిలో రూ.9.10 పెరిగింది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా, IGL CNG ధరను పెంచుతున్నాయి. ఏప్రిల్ 1న CNG ధర 80 పైసలు పెరిగింది. దీని తర్వాత ఏప్రిల్ 4న కిలోకు రూ.2.50 పెరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 6న దీని ధర రూ.2.50 పెరిగింది. IGL గత నెలలో CNG ధరలను కిలోకు 10 రూపాయలు పెంచింది.

హైదరాబాద్‌లో రూ. 75.75 ఉండగా విజయవాడలో రూ.74.75 ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో ధర రూ.71.67గా ఉంది. ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీలో రూ.76.34కు విక్రయిస్తున్నారు. గురుగ్రామ్‌లో సీఎన్‌జీ ధర కిలోకు రూ.77.44కు పెరిగింది. కాగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.10.5.41. కాగా లీటర్ డీజిల్ ధర రూ.96.67 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 119.49గా ఉండగా, డీజిల్‌ రూ. 105.49 వద్ద కొనసాగుతోంది.విశాఖటపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120 కాగా, డీజిల్‌ రూ. 105.65 వద్ద ఉంది.

Read Also.. Mutual Funds: ELSS మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..