AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: ELSS మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..

ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఉద్యోగులు కాస్త టెన్షన్‌కు పడుతుంటారు. ఎందుకంటే వారు ఆఫీస్‌లో ట్యాక్స్ సేవింగ్స్‌(IncomeTax)కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి  ఉంది కాబట్టి...

Mutual Funds: ELSS మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..
Mutual Fund
Srinivas Chekkilla
|

Updated on: Apr 07, 2022 | 8:21 AM

Share

ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఉద్యోగులు కాస్త టెన్షన్‌కు పడుతుంటారు. ఎందుకంటే వారు ఆఫీస్‌లో ట్యాక్స్ సేవింగ్స్‌(IncomeTax)కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి  ఉంది కాబట్టి. చాలా మంది ఉద్యోగులు ట్యాక్స్ ఆదా చేసేందుకు ఇన్సూరెన్స్, లేదా ఏదైనా పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడతారు. అయితే ఇది సరైన వ్యూహమేనా అనేది అసలు ప్రశ్న. కొంత మంది ట్యాక్స్ సేవింగ్‌ కోసం ELSS స్కీమ్ లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడి వల్ల అతని ఇన్వెస్ట్‌మెంట్‌కు 12-15 శాతం ఇన్ కమ్ కూడా వస్తుంది. ఇలా చేయడం మంచిదేనా.. ELSS పథకం అంటే ఏమిటో చూద్దాం.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పన్ను రాయితీ అందిస్తున్న ఏకైక ప్లాన్. దీనిద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్-80C కింద ఇన్వెస్టర్లకు టాక్స్ సేవింగ్స్ ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. మీరు అసలు గరిష్ఠంగా ఆదా చేయగల టాక్స్ ఎంత అన్నదే. సంవత్సరానికి ఒక వ్యక్తి గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు టాక్స్ ఆదా చేయవచ్చు.

ELSS పెట్టుబడుల వల్ల ట్యాక్స్ ఆదాతో పాటు మంచి ఆదాయం వస్తుంది. అయితే దానిలో రిస్క్ గురించి కూడా ఆలోచించాలి. పన్ను ఆదా ప్రయోజనాల కోసం ELSSలో ఎంత డబ్బునైనా పెట్టుబడిగా పెట్టవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్స్ వద్ద ELSS లోడ్‌ ఉంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ.. ప్రజలు పెట్టుబడిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్‌ను పరిగణలోకి తీసుకోవటం లేదు. అందువల్ల అక్కడ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ట్యాక్స్ ఆదా చేయవచ్చు.. కానీ అదే సమయంలో రాబడిపై రిస్క్ ప్రభావం చూపవచ్చు. మీకు వాటి నుంచి ఎంత రాబడి వస్తుందనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. మీరు ఒకే సమయంలో చాలా ELSS లో పెట్టుబడి పెట్టినట్లయితే.. అది ప్రయోజనకరంగా ఉండదని తెలుసుకోండి.

మరో విషయం ఏమిటంటే.. 3 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ముగిసిన తర్వాత మంచి పనితీరు కనబరచని ELSS స్కీమ్ నుంచి మీ డబ్బును వెనక్కి తీసుకోవడం మంచిది. పెట్టుబడి పెట్టిన ELSS ఫండ్ బాగా పనిచేస్తుంటే.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయటం కొనసాగించివచ్చని MyWealthGrowth.com కో-ఫౌండర్ హర్షద్ చేతన్‌వాలా సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద టాక్స్ ఆదా ప్రయోజనాలను పొందేందుకు పెట్టుబడిదారులు కేవలం ఒకటి లేదా 2 ELSS స్కీమ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ELSS ఫండ్ అనేది షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వ్యూలో నుంచి మంచి పెట్టుబడి నిర్ణయం. అదే సమయంలో ఇది ట్యాక్స్‌ను కూడా ఆదా చేస్తుంది.

Read Also.. Lemon Price: కిలో నిమ్మకాయలు రూ.400.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే..!