Hyundai Car: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే కొత్త లుక్ కారు.. ఫీచర్స్, ధర వివరాలు..!
Hyundai Car: దక్షిణ కొరియన్ ఆటో మొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్లలోకి సరికొత్త క్రెటా నైట్(Knight Edition) ఎడిషన్ వేరియంట్‌న్ త్వరలోనే లాంచ్ చేయనుంది...
Hyundai Car: దక్షిణ కొరియన్ ఆటో మొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్లలోకి సరికొత్త క్రెటా నైట్(Knight Edition) ఎడిషన్ వేరియంట్‌న్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారుకు సంబంధిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోపొందుపర్చింది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. నైట్ ఎడిషన్ మోడల్ 1.5-లీటర్ MPI, 1.5-లీటర్ CRDi పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.13.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఈ హ్యుందాయ్ నైట్ ఎడిషన్ కారు పూర్తిగా బ్లాక్ కలర్ బ్లాక్ బీస్ట్‌గా కనిపించనుంది. ఈ కారు 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 113bhp శక్తిని, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరో వేరియంట్ 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 113bhp శక్తిని 250Nm టార్క్‌ను రిలీజ్ చేస్తోంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్-కన్వర్టర్, ఐవీటీ IVT గేర్ బాక్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఇందులో ఉండే ఫీచర్స్ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
ఇవి కూడా చదవండి: