- Telugu News Photo Gallery Amid Sri Lanka crisis from cinnamon to tea exports know interesting facts about Sri Lanka
Sri Lanka Crisis: దాల్చిన చెక్క నుంచి టీ ఎగుమతి వరకు.. శ్రీలంక గురించి మీకు తెలియని ఐదు ఆసక్తికర విషయాలు..!
Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం మధ్య అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రస్తుతానికి ఎమర్జెన్సీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ఏప్రిల్ 1వ తేదీన నిర్ణయం ..
Updated on: Apr 07, 2022 | 8:08 AM

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం మధ్య అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రస్తుతానికి ఎమర్జెన్సీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ఏప్రిల్ 1వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు శ్రీలంక ప్రపంచంలో తన ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం శ్రీలంకలోని సింహరాతిగా పిలువబడే సిగిరియా కోట. శ్రీలంకకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

వరల్డ్ టాప్ ఎగుమతి నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే టీ ఎగుమతి చేసే దేశాలలో శ్రీలంక ఒకటి. వీటిలో చైనా, కెన్యా, శ్రీలంక, ఇండియా, పోలాండ్ ఉన్నాయి. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల టీ ఈ ఐదు ప్రధాన దేశాల నుంచి ఎగుమతి అవుతోంది. టీ ఎగుమతుల పరంగా ఇక్కడ అతిపెద్ద కంపెనీ జార్జ్ స్టువర్ట్ గ్రూప్.

దాల్చిన చెక్కను ప్రపంచవ్యాప్తంగా ఔషధంగా, ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. దీనిని 2000BC ఈజిప్టుకు చెందిన వ్యక్తి శ్రీలంకలో కూడా కనుగొన్నారు. ప్రపంచంలో 80 నుండి 90 శాతం దాల్చినచెక్క శ్రీలంక నుండి రవాణా చేయబడుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది.

అంతే కాదు జలవిద్యుత్ పరంగా కూడా శ్రీలంక స్థానం మెరుగ్గా ఉంది. ఇక్కడ చాలా జలపాతాలు, నదులు ఉన్నాయి. వాటి నుండి విద్యుత్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. దాదాపు 50 శాతం జనాభా అవసరాలను తీర్చడానికి నీటి నుండి విద్యుత్తును తయారు చేస్తారు. అందుకే ఇక్కడ జలవిద్యుత్ పై చాలా పనులు జరిగాయి.

అక్షరాస్యత పరంగా కూడా పొరుగు దేశాల కంటే శ్రీలంక స్థానం మెరుగ్గా ఉంది. ప్రపంచ డేటా అట్లాస్ నివేదిక ప్రకారం.. 2019లో ఇక్కడ అక్షరాస్యత రేటు 92.3. ఇది గత కొన్ని సంవత్సరాలలో హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ, సగటున ఈ సంఖ్య 90 శాతానికి దగ్గరగా ఉంది.

శ్రీలంక జెండా ప్రపంచంలోని పురాతన జెండాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీలంక మొదటి రాజు (విజయ్) భారతదేశం నుండే బంగారు సింహం జెండాను తీసుకున్నాడని చెబుతారు. బంగారు సింహం 1815 వరకు శ్రీలంక జెండాలో భాగంగా ఉంది. అయితే శ్రీలంక బ్రిటిష్ సిలోన్‌గా మారినప్పుడు జెండా మార్చబడింది. ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948లో మార్పు వచ్చి బంగారు ఖడ్గం పట్టిన సింహానికి జెండాలో స్థానం కల్పించారు.
