- Telugu News Photo Gallery Spiritual photos Hibiscus Flower According to Vastu Shastra use hibiscus flower in this way for happiness and prosperity in telugu
Hibiscus Flower: మందారం పువ్వుని ఈ విధంగా వాడండి.. ఇంట్లో సంపద, ఆనందం మీ సొంతం
Hibiscus Flower: వాస్తు శాస్త్రంలో కొన్ని పువ్వులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వీటిలో ఒకటి మందార పువ్వు. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Apr 07, 2022 | 8:07 AM

1 మందార పువ్వులు చాలా అందంగా ఉంటాయి. వాస్తు శాస్త్రంలో ఈ పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఈ పువ్వులు జీవితంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. ఇంట్లో ఆనందం, సంపదలను తీసుకురావడానికి మందార పువ్వును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం నాడు హనుమంతునికి ఎర్ర మందార పువ్వును సమర్పించండి. ఇలా చేయడం చాలా శుభప్రదం. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మందార పువ్వును సమర్పించండి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం, శాంతి, సంపదలు కలుగుతాయి.

మందార పువ్వు సూర్య భగవానుడికి చాలా ఇష్టం. మందార పువ్వు లేని సూర్య భగవానుడి ఆరాధన అసంపూర్ణం. రోజూ మందార పువ్వును నీటిలో వేసి సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇది మీరు ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

సూర్య దోషాన్ని తొలగించడానికి మందార చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటికి తూర్పు దిశలో మందార పువ్వు మొక్కను నాటండి. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి దూరమవుతుంది. మందార పువ్వును స్టడీ టేబుల్‌పై ఉంచడం వల్ల పిల్లలు చదువుకోవడానికి మొగ్గు చూపుతారు.

మందార పువ్వు మంగళ దోషాన్ని తొలగించడానికి కూడా చాలా మేలు చేస్తుంది. అంగారకుడి రంగు ఈ పువ్వులానే ఎర్రగా ఉంటుంది. ఇంట్లో మందార పువ్వు మొక్కను నాటండి. ఇది మంగళ దోషాన్ని తొలగిస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలను దూరం చేస్తుంది.




