Free Charging: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్.. ఉచితంగా EV ఛార్జింగ్ చేసుకోవచ్చని ప్రకటన..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు , దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్ అంబానీ తన ఉద్యోగులకు భారీ బహుమతిని అందించారు...
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు , దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్ అంబానీ తన ఉద్యోగులకు భారీ బహుమతిని అందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తన ముంబై క్యాంపస్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ ప్రాంగణంలో ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ (RCP), నవీ ముంబై క్యాంపస్‌లో Jio-bp పల్స్ EV ఛార్జింగ్ జోన్ గురించి తెలియజేస్తూ కంపెనీ HR బుధవారం తన ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. రిలయన్స్ ఇతర క్యాంపస్‌లలో కూడా ఇలాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. రిలయన్స్ ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఉచితంగా ఛార్జ్ చేయడానికి Jio-bp పల్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లోని జియో-బిపి పల్స్ జోన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ల కోసం వివిధ కాన్ఫిగరేషన్‌ల ఆరు ఛార్జర్‌లను కలిగి ఉంది. ఉద్యోగులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఉచితంగా ఛార్జ్ చేయడానికి ‘Jio-bp pulse Charge mobile app’ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని కంపెనీ తెలిపింది. EV ఛార్జింగ్ సెషన్‌ను ప్రారంభించడానికి, ఛార్జింగ్ యూనిట్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాలి. రిలయన్స్ BP మొబిలిటీ లిమిటెడ్ Jio-BP బ్రాండ్ పేరుతో పనిచేస్తోంది. భారతదేశంలో ప్రముఖ EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్‌గా ఉండాలనే లక్ష్యంతో బహుళ డిమాండ్ అగ్రిగేటర్‌లు, OEMలు, సాంకేతిక భాగస్వాములతో కలిసి పని చేయడం. 2021లో Jio-bp దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ హబ్‌లో ఒకదానిని ఢిల్లీలోని ద్వారకలో నిర్మించి, దాని ప్రాథమిక కస్టమర్‌గా బ్లూస్మార్ట్‌తో ప్రారంభించింది.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. EV ఛార్జింగ్ సమస్యను అధిగమించడానికి FAME ఇండియా పథకం రెండో దశ కింద దేశంలోని 16 హైవేలు, 9 ఎక్స్‌ప్రెస్‌వేలపై 1576 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైవేకి ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంలో కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా, 100 కి.మీ దూరంలో హైవేకి ఇరువైపులా లాంగ్ రేంజ్ హెవీ డ్యూటీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి EV ఛార్జింగ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీ పెట్టుబడిని ప్రకటించారు.
Read Also.. CNG Price Hike: భారీగా పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోకు రూ.2.50 చొప్పున పెంపు.