Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..
Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2022 | 4:46 PM

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. గతనెల విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రూ. 450 కోట్ల బారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం ముంబాయిలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొనన్నారు. చరణ్.. తారక్ అద్భుతనటనను.. రాజమౌలి వర్కింగ్ స్టైల్ పై ప్రశంసలు కురింపించారు. భారీ విజయాన్ని అందుకున్నందుకు చిత్రయూనిట్‏కు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ వేడుకలో అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ ఎంత ఒత్తిడికి గురవుతుందో నాకు తెలుసు. ఆర్ఆర్ఆర్ విడుదలై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి గారు.. ఆయన టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని.. మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్‏టైన్ చేయాలని కోరుకుంటున్నా అని అమీర్ ఖాన్ తెలిపారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ఆమిర్ ఖాన్ , నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. కేవలం పేర్లు పెట్టి పిలిచుకోవాలని సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవల ఓ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. ఆయన్ని సర్ అని కాకుండా ఏకే అని పిలవడానికి నేను ఇబ్బందిపడ్డాను. ఆమిర్ ఒత్తిడి చేయడంతోనే నేను ఆయన్ని ఏకే అని పిలిచాను. కానీ ఇప్పుడు ఆయన మా మధ్య ఉన్న అగ్రిమెంట్ బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?

Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..

Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..