Bandla Ganesh: మీకు తిరుగులేదు దేవర.. పవర్‌స్టార్‌పై మరోసారి ప్రేమ కురిపించిన బండ్లన్న.. ట్వీట్‌ వైరల్‌..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే పవన్‌కు అతను అభిమాని కాదు భక్తుడు అని ఫ్యాన్స్‌ అంటుంటారు.

Bandla Ganesh: మీకు తిరుగులేదు దేవర.. పవర్‌స్టార్‌పై మరోసారి ప్రేమ కురిపించిన బండ్లన్న.. ట్వీట్‌ వైరల్‌..
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2022 | 4:24 PM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే పవన్‌కు అతను అభిమాని కాదు భక్తుడు అని ఫ్యాన్స్‌ అంటుంటారు. సందర్భమేదైనా సరే.. పవన్‌ పేరు చెబితేనే పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటాడు బండ్లన్న. ఆ అభిమానంతోనే పవన్‌ని దేవర అని ప్రేమగా పిలుచుకుంటారు. అలా ఆయనపై ఉన్న అభిమానాన్ని బండ్ల మరోసారి చాటుకున్నాడు. ఆసక్తికరమైన ట్వీట్‌ చేసి సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు. ఇంతకీ విషయమేమిటంటే.. భీమ్లానాయక్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఇటీవల షూటింగ్‌ మళ్లీ పట్టాలెక్కింది. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాను త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో పవన్‌ కూడా సినిమా సెట్లోకి అడుగుపెట్టాడు. చారిత్రక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం పవన్‌ రిహార్సల్స్‌ ప్రారంభించారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోడర్‌ లాజరోవ్‌తో కలిసి కొన్ని పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్‌ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవికాస్తా వైరల్‌గా మారాయి.

ఇవే ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన బండ్ల గణేశ్‌ ‘గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా.. ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా హరిహర వీరమల్లు సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్గా నటిస్తుండగా.. అర్జున్‌ రామ్‌పాల్‌, నర్గీస్‌ఫక్రి, ఆదిత్య మేనన్‌, శుభలేక సుధాకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also Read: Srinidhi Shetty: క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

AP Cabinet: కాసేపట్లో మంత్రుల మూకుమ్మడి రాజీనామా.. లైవ్ వీడియో

AP Cabinet: కాసేపట్లో మంత్రుల మూకుమ్మడి రాజీనామా.. లైవ్ వీడియో

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!