Income Tax: మన దేశంలో టాక్స్ కట్టని వారు ఎందరో తెలుసా? వారి బకాయిలు ఎన్ని లక్షల కోట్లంటే..
Income Tax: ఏప్రిల్ 01, 2022 నాటికి కోటి మందికి పైగా ఇండివిడ్యూవల్స్(Individuals) నుంచి బకాయి వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభకు తెలియజేసింది.
Income Tax: ఏప్రిల్ 01, 2022 నాటికి కోటి మందికి పైగా ఇండివిడ్యూవల్స్(Individuals) నుంచి రూ. 8.40 లక్షల కోట్లకు పైగా బకాయి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభకు తెలియజేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వద్ద రూ. 21,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని సొమ్ము ఉందని ఈ సందర్బంగా వెల్లడించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక వ్రాతపూర్వక సమాధానంలో, కార్పొరేట్ పన్ను కాకుండా ఇతర ఆదాయంపై పన్నులు FY2019-20లో రూ. 4.80 లక్షల కోట్ల నుంచి FY2020-21లో రూ. 4.70 లక్షల కోట్లకు పడిపోయాయని తెలిపారు. అయితే.. ఇది FY2018-19లో రూ. 4.61 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆదాయపు పన్ను చట్టం- 1961లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం బాకీ ఉన్న పన్నులను త్వరితగతిన రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వార్షిక కేంద్ర కార్యాచరణ ప్రణాళిక పత్రంలో భాగంగా పన్నుల బకాయిల రికవరీ వ్యూహాలు, లక్ష్యాలు నిర్దేశించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. వ్యక్తిగత లావాదేవీ ప్రకటన వంటి డేటాబేస్‌లు, FIU-IND వంటి ఇతర ఏజెన్సీల ద్వారా నిర్వహించబడేవి రికవరీ కోసం ఆస్తుల గుర్తింపు, ఏదైనా రీఫండ్ బకాయి ఉన్నట్లయితే, ప్రక్రియ ప్రకారం బాకీ ఉన్న డిమాండ్‌కు సర్దుబాటు చేయబడుతుందని ఆయన చెప్పారు.
LIC తన వెబ్‌సైట్‌లో అన్‌క్లెయిమ్ చేయని మొత్తాలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచిందని, పాలసీదారులు/చట్టపరమైన వారసులు తమ పాలసీ నంబర్‌తో క్లెయిమ్ చేయని మొత్తాలను వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని వివరించారు. డిసెంబర్ 31, 2021 నాటికి, వ్యక్తిగత, సమూహ వ్యాపార పాలసీల ప్రకారం, క్లెయిమ్ చేయని (10 సంవత్సరాలకు మించని కాలానికి) రూ. 21,336.28 కోట్ల మొత్తాన్ని కలిగి ఉందని LIC తెలియజేసింది. దీనికి తోడు సెప్టెంబర్ 20, 2021 వరకు.. క్లెయిమ్ చేయని (10 సంవత్సరాలకు పైగా) రూ. 1,255.66 కోట్ల మొత్తాన్ని SCWF (సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్)కి బదిలీ చేశారు.
ఇవీ చదవండి..
Anand Mahindra: ఆమె ట్వీట్ కు ఎమోష్నల్ అయిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే..