AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటో చూడగానే మీకు ముందుగా ఏం కనిపిస్తోంది.. దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..

Optical Illusion: ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలు ఇటీవల బాగా వైరల్‌ అవుతున్నాయి. ఒక దృశ్యాన్ని మనం చూసే దృక్కోణంపై మన ఆలోచనలు ఎలా ఉంటాయన్నదానిని అంచనా వేయడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోల ముఖ్య ఉద్దేశం...

Optical Illusion: ఈ ఫోటో చూడగానే మీకు ముందుగా ఏం కనిపిస్తోంది.. దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
Viral Photo
Narender Vaitla
|

Updated on: Apr 07, 2022 | 1:14 PM

Share

Optical Illusion: ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలు ఇటీవల బాగా వైరల్‌ అవుతున్నాయి. ఒక దృశ్యాన్ని మనం చూసే దృక్కోణంపై మన ఆలోచనలు ఎలా ఉంటాయన్నదానిని అంచనా వేయడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోల ముఖ్య ఉద్దేశం. సాధారణంగా సైకియాట్రిస్ట్‌లు ఇలాంటి ఫోటోలను చూపించి మన ఆలోచనలను అంచనా వేస్తారు. నిజానికి ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ టెక్నిక్‌ ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నా తాజాగా సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి అందరికీ పరిచయమవుతోంది. సోషల్‌మీడియాలో ఇలాంటి ఫోటోలను పోస్ట్‌ చేస్తూ మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.? అంటూ పోస్టులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటో చూడగానే మీకు ఏం కనిపిస్తుంది.? ఒకటి యాపిల్‌, రెండోది దీర్ఘంగా చూస్తే రెండు ముఖాలు ఎదురెదురుగా ఉన్నట్లు కనిపిస్తోంది కదూ. అయితే ఈ రెండింటిలో ఏది మొదట కనిపిస్తుందో దాని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఈ ఫోటోను ఎడ్జర్ రుబిన్‌ అనే ప్రముఖ సైకాలజిస్ట్‌ 1915లో రూపొందించారు. ఈ ఫోటో ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేసేవారు.

ముందుగా యాపిల్ కనిపిస్తే..

ఫోటోను చూడగానే ముందుగా యాపిల్‌ కనిపిస్తే మీరు మీ జీవితం పట్ల సంతోషంగా ఉన్నారని అర్థం. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని అంగీకరిస్తారు. మీకు సన్నిహితులుగా భావించే వారిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. వారు మీకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీలోని సానుకూల దృక్పథాన్ని ఇతరులకు పంచుతారు.

ముఖాలు కనిపిస్తే..

ఒకవేళ మీకు ఫోటో చూడగానే ఎదురెదురుగా ఉన్న ముఖాలు కనిపిస్తే.. మీరు బంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అర్థం. అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వారితోనే అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ దూరం ఎక్కువ కాలం కొనసాగకుండా ఉండాలంటే వారితో కూర్చొని మాట్లాడాలి అలా చేస్తే సమస్యలు దూరమవుతాయి.

Also Read: Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..

Andhra Pradesh: ఆ ఇంటి యజమానిది గుండె కాదు రాయి… అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే..

Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఆహారం..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...