Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఆహారం..
Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ దిల్ పసంద్(Dil pasand),టిండా, ఇండియన్ బేబీ పంప్కిన్ (Indina Baby Pumpkin) అని కూడా అంటారు. ఇది షుగర్ పేషేంట్స్ కు..
Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ దిల్ పసంద్(Dil pasand),టిండా, ఇండియన్ బేబీ పంప్కిన్ (Indina Baby Pumpkin) అని కూడా అంటారు. ఇది షుగర్ పేషేంట్స్ కు బెస్ట్ ఎంపిక. వేసవి సాగు చేసే కూరగాయ ఈ టిండా. రైతులు మేలైన టిండా విత్తడం ద్వారా లాభాలను పొందవచ్చని.. వ్యవసాయ సాగు పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. వీరు చెప్పిన పద్ధతిలో టిండాను సాగు చేస్తే.. వ్యవసాయంలో లాభాలు పొందవచ్చు. వేడి , తేమతో కూడిన వాతావరణం టిండా సాగుకు అనుకూలం. అందుకనే వేసవిలో మాత్రమే దీనిని సాగు చేస్తారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాల మట్టిలో సాగు చేయవచ్చు. అయితే మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తేలికపాటి లోమీ నేల టిండా సాగుకు మంచి ఎంపిక.
టిండా ను ఏడాదికి రెండు సార్లు సాగు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుండి మార్చి వరకు , జూన్ నుండి జూలై వరకూ అనుకూల సమయం. దిగుబడి కోసం మేలైన రకాల టిండా విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. టిండా పంట సాధారణంగా రెండు నెలల్లో పక్వానికి సిద్ధంగా ఉంటుంది.
దిల్ పసంద్ (టిండా) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. దీనిని ఆయుర్వేద ఔషధాల్లోనూ కూడా వాడుతువుంటారు. ఇంకా చాలా ప్రయోజనాలు వున్నాయి.
బరువు తగ్గడం కోసం: టిండాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో నీటి కంటెంట్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినాలనే కోరికను నియంత్రిస్తుంది. కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: టిండాలో కొవ్వు , కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె కండరాల పనితీరు సరైన విధంగా ఉండేలా చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైన గుండె కోసం టిండాను వారి రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
జీర్ణవ్యవస్థకు మంచిది:టిండాలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరిని నివారిస్తుంది. ఇందులో ఉండే లాక్సిటివ్‌లు ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి, పేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: టిండాలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇందులో కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. లుటీన్, జియాక్సంతిన్, ఇవి రెటీనాలో కీలకమైన భాగాలు.. సున్నితమైన కంటి అవయవాలను రక్షిస్తాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: టిండాలో పాలీఫెనాల్ , కుకుర్బిటాసిన్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అదనంగా, ఈ బయోయాక్టివ్ భాగాలు శరీరం ముఖ్యమైన అవయవాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ , క్యాన్సర్ కలిగించే టాక్సిన్స్ నుండి రక్షిస్తాయి.
Also Read: RGV: వివాదాలతో సావాసాలు.. సినిమాలతో సాహసాలు.. కొటేషన్లలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆలోచనలు..