AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!

IPL 2022: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. నిన్న ఢిల్లీకి, లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో లక్నో విజయం సాధించింది. అయితే

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!
Rishabh Pant
uppula Raju
|

Updated on: Apr 08, 2022 | 3:13 PM

Share

IPL 2022: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. నిన్న ఢిల్లీకి, లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన విధానంపై అందరు మండిపడుతున్నారు. కెప్టెన్ అయ్యాక సరిగ్గా ఆడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు మాత్రమే చేశాడు. వాస్తవానికి 39 పరుగులు చెడ్డ స్కోరు ఏం కాదు. కానీ జట్టు బాధ్యత మొత్తం మీదున్నప్పుడు అలా ఆడటం తప్పు. రిషబ్‌ నిన్నటి మ్యాచ్‌లో చాలా నెమ్మదిగా ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలుచున్నాడు. కానీ స్కో్రు మాత్రం 150 పరుగులు దాటించలేకపోయాడు.

నిన్నటి మ్యా్‌చ్‌లో 8వ ఓవర్ తర్వాత పరుగుల వేగం తగ్గింది.. ఎక్కువ వికెట్లు పడకపోయినా రిషబ్ పంత్ నెమ్మదిగా ఆడాడు.. 180 వరకు వెళ్లాల్సిన స్కోరు 149కే పడిపోయింది. ఈ కారణాల వల్ల కెప్టెన్‌ అయ్యాక పంత్‌ సరిగ్గా ఆడటం లేదని అందరిలో చర్చ జరుగుతోంది. వేగవంతమైన బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ ఒకరు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడిపోయింది. తర్వాతి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్ కూడా ఔటయ్యాడు. అయితే మిడిల్ ఆర్డర్ మొత్తం మిగిలింది. అన్నింటిలో మొదటిది రిషబ్ పంత్ ఆఫ్-సైడ్‌లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ 128.78గా ఉంది. క్రికెట్‌లో విభిన్న రకాల షాట్లు ఆడటంలో పేరుగాంచాడు. చాలా సార్లు అతను కొత్త తరహా షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు క్రీజులో పడిపోవడం కూడా జరుగుతుంది.

ఇప్పటివరకు ఢిల్లీ ఖాతాలో ఐపీఎల్‌ ట్రోఫీ చేరలేదు. ఈ కలను నెరవేర్చుకోవాలంటే రిషబ్ పంత్, పృథ్వీ షా ఆడటం తప్పనిసరి. లక్నోపై పృథ్వీ షా బ్యాటింగ్ చూసిన పంత్ కాస్త ప్రశాంతంగా కనిపించాడు. రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్‌లో బలంగా బ్యాటింగ్ చేయడం అవసరం. ఫేవరెట్ ఆటగాళ్లపై ఇలాంటి ఒత్తిడి రావడం భారత క్రికెట్‌లో కొత్తేమి కాదు. ఎందుకంటే భారత జట్టు కాబోయే కెప్టెన్ రేసులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడని మరిచిపోవద్దు. అందుకే అందరి చూపు అతని ఆటపైనే ఉంది.

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!

LSG vs Delhi: అదరగొట్టిన ఫృధ్వీషా.. లక్నో టార్గెట్‌ 150 పరుగులు

Army Jobs: ఆర్మీ ఉద్యోగాలలో సరికొత్త మార్పులు.. ఐదేళ్లు, మూడేళ్లకే రిటైర్మెంట్..!