AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించగా మరికొన్ని హాస్యాన్ని పండిస్తాయి. అయితే వివాహాలకు

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!
Viral Video
uppula Raju
|

Updated on: Apr 08, 2022 | 2:45 PM

Share

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించగా మరికొన్ని హాస్యాన్ని పండిస్తాయి. అయితే వివాహాలకు సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా ఆదరిస్తారు. వధూవరులకి సంబంధించిన వీడియోలు, పెళ్లి ఊరేగింపు వీడియోలు, మండపంలోని సంఘటనలకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తాయి. ఇలాంటి వీడియోలు బాగా వైరల్‌ అవుతాయి. తాజాగా వివాహానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కొడుకు స్నేహితుడు చేసే పనికి అందరు షాక్ అవుతారు. అంతేకాదు ఇలాంటి వారు కూడా ఉంటారా బాబు.. అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇంతకీ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మంచంపై మెడలో నోట్ల మాల వేసుకొని వరుడు దర్జాగా కూర్చొని ఉంటాడు. అతడి పక్కన బంధువులు, స్నేహితులు అందరు కూర్చొని ఉంటారు. అందులో ఒక స్నేహితుడు కళ్లు మొత్తం వరుడి మెడలో వేసిన నోట్ల మాలపై ఉండటం మనం గమనించవచ్చు. నెమ్మదిగా మాలనుంచి డబ్బులు దొంగిలించడానికి వరుడి స్నేహితుడు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో వరుడికి అనుమానం రావడంతో స్నేహితుడు ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. కానీ కొద్దిసేపటికి మళ్లీ ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. చివరికి మాల నుంచి నోట్లు లాగేసుకొని పాకెట్‌లో పెట్టుకుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.

ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. రెండు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని 97 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోని యూజర్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆనందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు ‘ఇది ఇండియన్ మనీ హీస్ట్’ అని తెలిపాడు. ప్రజలు నిరంతరం ఫన్నీ రియాక్షన్లు ఇస్తూనే ఉన్నారు.

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

LSG vs Delhi: అదరగొట్టిన ఫృధ్వీషా.. లక్నో టార్గెట్‌ 150 పరుగులు

Army Jobs: ఆర్మీ ఉద్యోగాలలో సరికొత్త మార్పులు.. ఐదేళ్లు, మూడేళ్లకే రిటైర్మెంట్..!

Banana Peel Benefits: అరటి తొక్కలో అద్భుత గుణాలు.. వీటిని అస్సలు కోల్పోకండి..!