- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Gujarat Titans Captain Hardik Pandya need one more six to complete 100 sixes in IPL
IPL 2022: గుజరాత్ సారథి ఖాతాలో చేరనున్న స్పెషల్ రికార్డు.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే..
ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ విజయ రథంపై పయనిస్తోంది. అయితే అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ మాత్రం కనిపించలేదు.
Updated on: Apr 08, 2022 | 2:45 PM

ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతో బాగానే ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు విజయ రథంపై పయనిస్తోంది. అయితే అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. అయితే ఈ రోజు ఇన్నింగ్స్‌లో ఓ ప్రత్యేక రికార్డును సాధించేందుకు బరిలోకి దిగనున్నాడు.

ఈరోజు ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో, హార్దిక్ పాండ్యా తన 88వ ఇన్నింగ్స్‌ను ఆడనున్నాడు. ఇందులో అతను ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇందుకోసం హార్దిక్ కేవలం ఒక సిక్సర్ దూరంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో 87 ఇన్నింగ్స్‌లు ఆడిన పాండ్యా ప్రస్తుతం 99 సిక్సరను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో 105 ఫోర్లు బాదేశాడు. అలాగే 1540 పరుగులు చేశాడు.

నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కూడా సిక్సర్ల రేసులో ముందంజ వేయాలని భావిస్తోంది. నిజానికి ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 36 సిక్సర్లు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కింగ్స్‌ను దాటేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇందుకు కేవలం మరో 4 సిక్సర్లు కొట్టాల్సి ఉంది.




