- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 csk captain ravindra jadeja set for 150th match for chennai super kings
IPL 2022: రవీంద్ర జడేజా చారిత్రాత్మక మ్యాచ్.. ధోని,రైనా తర్వాత ఆ క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడు..
IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు గెలవాలనే తపనతో ఉంది. కొత్త కెప్టెన్ రవీంద్ర
Updated on: Apr 08, 2022 | 7:06 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు గెలవాలనే తపనతో ఉంది. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇది 150వ మ్యాచ్.

శనివారం రవీంద్ర జడేజా మైదానంలోకి దిగినప్పుడు అతను 150వ సారి చెన్నై జెర్సీలో కనిపిస్తాడు. మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా తర్వాత 150వ మ్యాచ్ ఆడిన మూడో ఆటగాడు జడేజా. సీఎస్‌కే తరఫున ధోనీ 217 మ్యాచ్‌లు ఆడగా, సురేశ్ రైనా 200 మ్యాచ్‌లు ఆడాడు.

CSKతో జడేజా క్రికెట్ జర్నీ 2012లో ప్రారంభమైంది. ఆల్ రౌండర్‌గా దశాబ్ద కాలం పాటు జట్టుకి సేవలందించాడు. 2018, 2022 రెండు సంవత్సరాలలో జట్టు అతనిని నిలుపుకుంది.

149 మ్యాచ్‌ల్లో 110 వికెట్లు తీసి CSK తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా జడేజా నిలిచాడు. అంతేకాకుండా 1,523 పరుగులు చేశాడు. అతను జట్టులో ఒక ముఖ్యమైన భాగం



