Ontimitta: బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక శోభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఒంటిమిట్ట(Ontimitta) లోని బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఒంటిమిట్ట(Ontimitta) లోని బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ ప్రకటనలో వెల్లడించింది.15వ తేదీ రాత్రి 8 గంటలకు సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందని వివరించారు. ఏప్రిల్ 9 న ఉదయం వ్యాసాభిషేకంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి, 19న సాయంత్రం శ్రీపుష్పయాగంతో ముగియనున్నాయి. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లను(arrangements) వేగంవంతం చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రాకారం అంతర్భాగం చుట్టూ పందిరి, మాడ వీధులు, ఉద్యాన వనాలు, పుష్కరిణి, కాలిబాటలు, పార్కింగ్ ఏరియా, కల్యాణ వేదిక ప్రాంగణంలో అధిక కాంతినిచ్చే విద్యుద్దీపాలను ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యుత్ కు అంతరాయం కలిగితే సమస్యలు రాకుండా జనరేటర్లు తెప్పించారు. వీవీపీఐ, వీఐపీ, సామాన్య భక్తులు ప్రాంగణంలోకి రావడానికి వేర్వేరుగా క్యూలైన్లు వేస్తున్నారు. కాలిబాటలో భక్తుల నడక సాగించడానికి అనువుగా చల్లదనం కోసం కూల్ పెయింట్ వేసే పనులు జరుగుతున్నాయి. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అదే రోజున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
Also Read
Gitam University: గీతమ్ యూనివర్సిటీకి బార్క్ బహుమతి.. విద్యార్థుల పరిశోధనల కోసం సహాయం
Health: కరోనా తర్వాత ఈ వ్యాధి ముదురుతోంది.. 20 నుంచి 30 సంవత్సరాలవారే బాధితులు..!
Stock Market: RBI ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.247 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద..