Gitam University: గీతమ్‌ యూనివర్సిటీకి బార్క్ బహుమతి.. విద్యార్థుల పరిశోధనల కోసం సహాయం

గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌ కు.. ముంబయి(Mumbai) లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)కు చెందిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్స్ & అలైడ్ సైంటిస్ట్స్ (IANCAS) రూ.3 లక్షల విలువైన పరికరాలను బహుమతిగా....

Gitam University: గీతమ్‌ యూనివర్సిటీకి బార్క్ బహుమతి.. విద్యార్థుల పరిశోధనల కోసం సహాయం
Gitam
Follow us

|

Updated on: Apr 08, 2022 | 7:55 PM

గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌ కు.. ముంబయి(Mumbai) లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)కు చెందిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్స్ & అలైడ్ సైంటిస్ట్స్ (IANCAS) రూ.3 లక్షల విలువైన పరికరాలను బహుమతిగా అందించింది. రేడియేషన్‌ గుర్తించి, కొలిచేందుకు, రేడియో ఐసోటోప్‌లతో సురక్షితంగా పని చేసేందుకు ఈ పరికరాలు సహకరిస్తాయని వారు తెలిపారు. వీటిలో బీటా రేడియేషన్‌ను కొలవడానికి గీగర్ ముల్లర్ కౌంటర్, గామా రేడియేషన్‌ను కొలవడానికి గామా స్కింటిలేషన్ డిటెక్టర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన 45 మంది ఫ్యాకల్టీ సభ్యులు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 20 మంది ప్రొఫెసర్లకు కోసం రేడియోకెమిస్ట్రీ అండ్‌ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అనే అంశంపై హైదరాబాద్‌ గీతంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్‌లో బార్క్ శాస్త్రవేత్తలు పాల్గొంటారు. గీతమ్‌కు ఇంత విలువైన పరికరాలు బహుమతిగా ఇచ్చినందుకు బార్క్‌కు ప్రిన్సిపాల్ జీఏ.రామారావు ధన్యవాదాలు తెలిపారు.

నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ తీర్చేందుకు భారతదేశానికి ఒక ముఖ్యమైన అణు ఇంధనం ఒక ఆప్షన్‌. పాఠశాలల్లో పదో తరగతి నుంచి విద్యార్థులకు ఈ సబ్జెక్ట్‌ పరిచయం చేస్తున్నా పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు రేడియోధార్మికత గురించి ఎలాంటి అనుభవం ఉండకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సబ్బు, ఉప్పు వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తులు బీటా రేడియేషన్‌ విడుదల చేయడానికి తగినంత సహజంగా సంభవించే K-40 రేడియో ఐసోటోప్‌లను కలిగి ఉన్నాయని పరికరాలు ఉపయోగించి బార్క్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

రేడియోధార్మికత, క్షయము, రేడియేషన్, గుర్తింపు, కొలత, అలాగే రసాయన, భౌతిక శాస్త్రాలు, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం వంటి రంగాలలో రేడియో ఐసోటోప్‌ల ఉపయోగం, ప్రాథమిక విషయాలను బార్క్ నిపుణులు బోధించారు. కోబాల్ట్-60, కోబాల్ట్-67, థాలియం-204, పొటాషియం-40, సీసియం-137 వంటి రేడియో ఐసోటోప్స్ ఉపయోగించి ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించారు. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీపై అపార అనుభవం కలిగిన ఐఏఏఎన్సీఏఎస్(IAANCAS) కు చెందిన డాక్టర్ ఎస్.కన్నన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అందిస్తున్న సహకారాన్ని తెలియజెప్పారు. పాలిమర్‌ల రంగంలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వైకె భరద్వాజ్, పాలిమర్‌ టెక్నాలజీలో రేడియేషన్ ఉపయోగ విధానం గురించి వివరించారు.

Also Read

Sonu Sood: సోనూసూద్‏కు మరో అరుదైన గౌరవం.. కృతజ్ఞతలు తెలిపిన రియల్ హీరో..

వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్‌ !! మార్కెట్‌ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్

Ramadan 2022: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!