Hyderabad: సహాయం చేస్తానని సంతకాలు పెట్టించుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..
Cheating: కంచె చేను మేసినట్లు వృద్ధురాలిని నమ్మించి భారీగా డబ్బు కొట్టేశాడు ఓ బ్యాంకు ఉద్యోగి. సహాయం చేస్తున్నట్లు నమ్మించి ఏకంగా రూ.50లక్షలకు టోకరా పెట్టాడు.
Cheating: కంచె చేను మేసినట్లు వృద్ధురాలిని నమ్మించి భారీగా డబ్బు కొట్టేశాడు ఓ బ్యాంకు ఉద్యోగి. సహాయం చేస్తున్నట్లు నమ్మించి ఏకంగా రూ.50లక్షలకు టోకరా పెట్టాడు. సికింద్రాబాద్ పరిధిలోని తుకారాం గేట్ ఎస్‌బీఐ బ్యాంకులో పనిచేస్తోన్న శశికుమార్ రాజు ఈ మోసానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. శశి కుమార్ రాజు అనే వ్యక్తి తుకారాం గేట్ ఎస్‌బీఐలో 12 ఏళ్లుగా కంప్యూటర్ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. కాగా తన దగ్గరకు వచ్చిన ఓ వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి పలుమార్లు సంతకాలు తీసుకున్న అతడు.. రూ.50 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ మొత్తాన్ని కొట్టేశాడు. దీంతో పాటు బాధితురాలి సేవింగ్ అకౌంట్ లో ఉన్న దాదాపు 2,50,00 లను కూడా దోచుకున్నాడు. ఆమె యోనో అప్ లో ఫోన్ నంబర్ మార్చి యాప్ యాక్సిస్ తీసుకుని ఫిక్సడ్ డిపాజిట్ల మీద లోన్ తీసుకున్నాడు. కాగా గత నాలుగు నెలలుగా బ్యాంక్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు రావకపోవడంతో బాధితురాలికి అనుమానమొచ్చింది. అదేమని అడగ్గా ఎవ్వరికీ మెసేజ్ లు రావడం లేదని చెప్పి బుకాయించాడు.
తాను మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన వృద్ధురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడంతో నార్త్ జోన్ డీసీపీని కలిసి ఫిర్యాదు చేసింది. డీసీపీ ఆదేశాలతో కేసు నమోదుచేసిన తుకారాం గేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా సిబ్బంది చేతివాటంపై ప్రశ్నించగా బ్యాంక్ మేనేజర్ కూడా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నిందితుడు వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు.
Also Read: Viral Video: నిజమైనవి అనుకుంటే పొరపాటే.. మీ కళ్లను మాయచేసే వింతలు ఇవి.. వీడియో చేస్తే షాకే.. Shares: షేర్ల డీలిస్టింగ్ నుంచి పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండటం ఎలా.. పూర్తి వివరాలు..
Health Tips: నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!