Singareni Recruitment: సింగరేణిలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Singareni Recruitment: సింగరేణి కోల్ మైన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు...
Singareni Recruitment: సింగరేణి కోల్ మైన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ సర్జన్ (5), ఆర్థో సర్జన్ (5), ఈఎన్‌టీ సర్జన్ (2), ఆప్టల్మాలజిస్ట్ (3), గైనకాలజిస్ట్ (7), ఫిజీషియన్ (4), రేడియాలజిస్ట్ (2), పాథాలజిస్ట్ (1), హెల్త్ ఆఫీసర్ (4), అనెస్థెటిస్ట్ (6), పిడియాట్రిషియన్ (3), సైకియాట్రిస్ట్ (1), చెస్ట్ ఫిజీషియన్ (2) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు నిండి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందు పని అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 8న ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ 17ను చివరి తేదీగా నిర్ణయించారు.
* ఇంటర్వ్యూలను ఏప్రిల్ 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Power Holiday Effect: విశాఖను వణికిస్తోన్న పవర్‌హాలీడే.. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత..!
Adani Group: అదానీ కంపెనీల్లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడి.. ఇన్వెస్ట్‌మెంట్ డీల్ విలువ ఎంతంటే..
Crime news: ప్రాణాలు తీసిన ఎయిర్ కండీషనర్.. ఇంట్లో నిద్రిస్తుండగా పేలుడు.. నలుగురు సజీవదహనం