Crime news: ప్రాణాలు తీసిన ఎయిర్ కండీషనర్.. ఇంట్లో నిద్రిస్తుండగా పేలుడు.. నలుగురు సజీవదహనం
కర్ణాటకలో ఘోరం జరిగింది. వేసవి కాలం(Summer) ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగించే ఏసీ(Air Conditioner) వారి పాలిట మృత్యువుగా మారింది. చల్లగా సేద తీరుతున్న ఆ కుటుంబంపై కర్కశంగా విరుచుకుపడింది. ఏసీ పేలి ఒకే కుటుంబానికి...
కర్ణాటకలో ఘోరం జరిగింది. వేసవి కాలం(Summer) ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగించే ఏసీ(Air Conditioner) వారి పాలిట మృత్యువుగా మారింది. చల్లగా సేద తీరుతున్న ఆ కుటుంబంపై కర్కశంగా విరుచుకుపడింది. ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకుని, పొగతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది. కర్ణాటకలోని(Karnataka) విజయనగర జిల్లా మిరియమ్మహల్లీ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో ఏసీ వేసుకుని నిద్రపోతోంది. ఈ క్రమంలో ఏసీ నుంచి గ్యాస్ లీక్ అయింది. అనంతరం మంటలు చెలరేగాయి. దీనికి తోడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అగ్నికీలలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న వెంకట్ ప్రశాంత్, అతడి భార్య డి.చంద్రకళ, కుమారుడు అద్విక్, కుమార్తె ప్రేరణ మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వారి సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసేందుకు ఇలా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏసీ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
Adani Group: అదానీ కంపెనీల్లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడి.. ఇన్వెస్ట్‌మెంట్ డీల్ విలువ ఎంతంటే..
Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!