AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: కేంద్ర ప్రభుత్వ అంచనాలను మించిన పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..

Income Tax: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో(Financial year) పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరినట్లు కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. 1999 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి అని వివరించారు. ఇదే సమయంలో ఎంత మంది ఇంకా పన్ను బకాయిలు ఉన్నారో తెలుసా..

Income Tax: కేంద్ర ప్రభుత్వ అంచనాలను మించిన పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..
Income Tax
Ayyappa Mamidi
|

Updated on: Apr 08, 2022 | 9:24 PM

Share

Income Tax: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో(Financial year) పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరినట్లు కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో మొత్తం రూ.27.07 లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు వెల్లడించారు. ఇది బడ్జెట్‌ అంచనా వేసిన రూ.22.17 లక్షల కోట్లతో పోలిస్తే అధికమని వివరించారు. ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వచ్చే వ్యక్తి ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులు కలిపి రూ.14.10 లక్షల కోట్లు వచ్చినట్లు తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. బడ్జెట్‌(Budget) అంచనాలతో పోలిస్తే ఇది రూ.3.02 లక్షల కోట్లు ఎక్కువని పేర్కొన్నారు. రూ.1.88 లక్షల కోట్ల ఎక్సైజ్‌ డ్యూటీతో కలుపుకొని మొత్తం పరోక్ష పన్నులు రూ.12.90 లక్షల కోట్లు వసూలైనట్లు తెలిపారు. బడ్జెట్‌లో వీటిని రూ.11.02 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడించారు. ప్రత్యక్ష పన్నుల్లో 49 శాతం, పరోక్ష పన్నుల్లో 30 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. జీడీపీలో పన్నుల వాటా 11.7 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. 1999 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి అని వివరించారు.

టాక్స్ బకాయిలు ఎంత ఉన్నాయంటే..

ఏప్రిల్ 01, 2022 నాటికి కోటి మందికి పైగా ఇండివిడ్యూవల్స్(Individuals) నుంచి రూ. 8.40 లక్షల కోట్లకు పైగా బకాయి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభకు తెలియజేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వద్ద రూ. 21,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని సొమ్ము ఉందని ఈ సందర్బంగా వెల్లడించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక వ్రాతపూర్వక సమాధానంలో, కార్పొరేట్ పన్ను కాకుండా ఇతర ఆదాయంపై పన్నులు FY2019-20లో రూ. 4.80 లక్షల కోట్ల నుంచి FY2020-21లో రూ. 4.70 లక్షల కోట్లకు పడిపోయాయని తెలిపారు. అయితే.. ఇది FY2018-19లో రూ. 4.61 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఆదాయపు పన్ను చట్టం- 1961లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం బాకీ ఉన్న పన్నులను త్వరితగతిన రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వార్షిక కేంద్ర కార్యాచరణ ప్రణాళిక పత్రంలో భాగంగా పన్నుల బకాయిల రికవరీ వ్యూహాలు, లక్ష్యాలు నిర్దేశించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. వ్యక్తిగత లావాదేవీ ప్రకటన వంటి డేటాబేస్‌లు, FIU-IND వంటి ఇతర ఏజెన్సీల ద్వారా నిర్వహించబడేవి రికవరీ కోసం ఆస్తుల గుర్తింపు, ఏదైనా రీఫండ్ బకాయి ఉన్నట్లయితే, ప్రక్రియ ప్రకారం బాకీ ఉన్న డిమాండ్‌కు సర్దుబాటు చేయబడుతుందని ఆయన చెప్పారు.

LIC తన వెబ్‌సైట్‌లో అన్‌క్లెయిమ్ చేయని మొత్తాలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచిందని, పాలసీదారులు/చట్టపరమైన వారసులు తమ పాలసీ నంబర్‌తో క్లెయిమ్ చేయని మొత్తాలను వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని వివరించారు. డిసెంబర్ 31, 2021 నాటికి, వ్యక్తిగత, సమూహ వ్యాపార పాలసీల ప్రకారం, క్లెయిమ్ చేయని (10 సంవత్సరాలకు మించని కాలానికి) రూ. 21,336.28 కోట్ల మొత్తాన్ని కలిగి ఉందని LIC తెలియజేసింది. దీనికి తోడు సెప్టెంబర్ 20, 2021 వరకు.. క్లెయిమ్ చేయని (10 సంవత్సరాలకు పైగా) రూ. 1,255.66 కోట్ల మొత్తాన్ని SCWF (సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్)కి బదిలీ చేశారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Adani Group: అదానీ కంపెనీల్లో అబుదాబి కంపెనీ భారీ పెట్టుబడి.. ఇన్వెస్ట్‌మెంట్ డీల్ విలువ ఎంతంటే..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ లో కమొడిటీస్ ఎందుకుండాలో తెలుసా..