House Loan: మరింత కాలం చౌకగా హోమ్ లోన్స్.. RBI ప్రకటనతో రియల్టీ జోరు

House Loan: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) మానిటరీ పాలసీలో గృహ రంగానికి వరాలను ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రియల్టీ రంగానికి ఊతం లభించనుంది.

House Loan: మరింత కాలం చౌకగా హోమ్ లోన్స్.. RBI ప్రకటనతో రియల్టీ జోరు
Home
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 08, 2022 | 10:01 PM

House Loan: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) మానిటరీ పాలసీలో గృహ రంగానికి వరాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో హౌసింగ్ సెక్టార్(Housing Sector) కోసం తీసుకొచ్చిన సరళీకృత నిబంధనలను వచ్చే ఏడాది వరకూ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఇళ్లను కొనుగోలు చేసే వారికి అత్యధికంగా క్రెడిట్ ఫ్లో లభించనుంది. అదేవిధంగా వడ్డీ రేట్లను పెంచకుండా.. యథాతథంగా ఉంచి గృహ రంగానికి మేలు చేకూర్చింది. దీంతో మరికొంత కాలం ఇళ్ల కొనుగోలుదారులు తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలను పొందవచ్చు.

గృహ రుణాలను చౌకగా అందించాలని నిర్ణయించిన ఆర్‌బీఐ.. రిస్క్ వెయిట్స్‌ను రేషనలైజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొత్త రుణాలను లోన్-టూ-వాల్యు(ఎల్‌టీవీ) రేషియోకి లింక్ చేసి, రిస్క్ వెయిట్‌ను హేతుబద్దీకరిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిబంధనలు మార్చి 31,2023 వరకు హోమ్ లోన్లకు కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. అంటే కొత్త గృహ రుణాలపై క్యాపిటల్ ప్రొవిజనింగ్ నిబంధనలు మరో ఏడాది పాటు సరళకరంగానే ఉండనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఊరటగా మారుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గృహ రుణాలు రికార్డు కనిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఈ కనిష్ఠ వడ్డీ రేట్లే మరి కొంత కాలం పాటు కొనసాగనున్నాయి. కరోనా తర్వాత 2021 నుంచే హౌసింగ్ సెక్టార్ కోలుకోవడం ప్రారంభమైంది. మరికొంత కాలం పాటు గృహ రుణాలు తక్కువ రేటుకే లభ్యం కావడం.. ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేయనుందని కొలియర్స్ ఆసియా మార్కెట్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా సీఈవో రమేశ్ నాయర్ చెప్పారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Income Tax: కేంద్ర ప్రభుత్వ అంచనాలను మించిన పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ లో కమొడిటీస్ ఎందుకుండాలో తెలుసా..

Srilanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. ఏప్రిల్ తరువాత పెనం మీద నుంచి పొయ్యిలోకి..