New Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెల రోజు వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
New Prepaid Plans: ప్రస్తుతం టెలికం కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి ఆయా టెలికం..
New Prepaid Plans: ప్రస్తుతం టెలికం కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి ఆయా టెలికం కంపెనీలు. ఇక రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone) కొత్తగా నెల రోజుల పాటు వ్యాలిడిటీతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ (Prepaid Plans)ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. 30 రోజుల వ్యాలిడిటీ ఉండేలా కనీసం ఒక్క ప్లాన్ అయినా యూజర్లకు అందుబాటులో ఉండాలని ట్రాయ్ ఇటీవల టెలికం కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు నెల రోజుల పాటు వ్యాలిడిటీ ఉండేలా సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి.
రిలయన్స్ జియో ప్లాన్స్ (Reliance Jio):
ఇక రియలన్స్ జియో కొత్తగా రూ.259, రూ.296 ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. రూ.259 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభించనున్నాయి. ఈ ప్లాన్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ముందు ఏ తేదీన రీచార్ఝ్ చేసుకున్నారో.. తర్వాత అదే తేదీన రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నట్లు. ఇక రూ.296 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 25జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వస్తాయి.
ఎయిర్‌టెల్ (Airtel):
ఇక ఎయిర్‌టెల్ ప్లాన్‌లో భాగంగా రూ.319,296 ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ.296 ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 25GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMSలు వినియోగించుకోవచ్చు. రూ.319 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే పూర్తి నెల రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లతో ఎయిర్‌టెల్‌థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.
వొడాఫోన్ ఐడియా (Vodafone Idea):
వొడాఫోన్ ఐడియా కూడా కొత్తగా రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.327,337 ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే 25GB డేటా వస్తుంది. ఈ ప్లాన్స్‌లో వీ మూవీస్, టీవీ ప్లాట్ ఫామ్‌లు ఉచితంగా పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: