Gold Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరి కొన్ని ప్రాంతాల్లో పెరగవు. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి
Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరి కొన్ని ప్రాంతాల్లో పెరగవు. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. అయితే శనివారం (ఏప్రిల్ 9)న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. అయితే వెండి ధరల్లో కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ధరలు పెరుగుదలకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరల (Gold Rate) వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,630 ఉంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,630 వద్ద ఉంది.
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,820 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,260 వద్ద నమోదవుతోంది.
కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,630 ఉంది.
బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,630 ఉంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630 వద్ద ఉంది.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630 ఉంది.
కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630 వద్ద ఉంది.
వెండి ధరలు:
ఇక వెండి ధరల్లో కూడా మార్పులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెరుగగా, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. ఇక తాజాగా దేశీయంగా పరిశీలిస్తే ప్రధాన ప్రాంతాల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, ముంబైలో రూ.66,800 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, కోల్‌కతాలో రూ.66,800 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, హైదరాబాద్‌లో రూ.71,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.
Also Read: