AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Holiday Effect: విశాఖను వణికిస్తోన్న పవర్‌హాలీడే.. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత..!

Power Holiday Effect: ఇండస్ట్రియల్ హబ్‌గా పేరుగాంచిన విశాఖను పవర్ హలీడే వణికిస్తో౦ది. గత రెండేళ్లుగా కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న పారిశ్రామిక రంగాన్ని..

Power Holiday Effect: విశాఖను వణికిస్తోన్న పవర్‌హాలీడే.. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేకత..!
Subhash Goud
|

Updated on: Apr 09, 2022 | 5:22 AM

Share

Power Holiday Effect: ఇండస్ట్రియల్ హబ్‌గా పేరుగాంచిన విశాఖను పవర్ హలీడే వణికిస్తో౦ది. గత రెండేళ్లుగా కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న పారిశ్రామిక రంగాన్ని APEPDCL తాజా నిర్ణయం కలవరానికి గురి చేస్తోంది. పవర్ హాలిడే (Power Holida)పై తమను సంప్రదించకుండా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై పారిశ్రామికవేత్తలు (Industrialists) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలను సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అనధికారికంగా అమలవుతూ వచ్చిన విద్యుత్‌ కోతలు ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చాయి. దీనిపై ఏపీ ఈపీడీసీఎల్‌ గురువారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత వున్న నేపథ్యంలో గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు 24/7 సరఫరా ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అమలు చేయనున్నట్టు తెలిపారు. నిరంతరాయంగా నడిచే పరిశ్రమలన్నీ వారి విద్యుత్‌ డిమాండ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఇతర పరిశ్రమలు వారానికి ప్రస్తుతం ఇస్తున్న ఒక రోజు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా ఆ పరిశ్రమలన్నీ కేవలం ఒక షిఫ్ట్‌ మాత్రమే పనిచేయాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాలి.

అయితే పవర్ హాలిడే పై విశాఖలో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ ఆటోనగర్ లో పవర్ హాలిడేపై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పారిశ్రామికవేత్తలను సంప్రదించకుండా ప్రభుత్వం ఆకస్మాత్తుగా పవర్ హాలీడే ప్రకటించడాన్ని పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, ఏపీఈపీడీసీఎల్ అధికారులను కలిసి పవర్ హాలిడే నుండి కొంతైనా సడలింపు కోరుతూ రిప్రజి౦టేషన్ ఇవ్వాలని విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. విశాఖలో ఆటోనగర్, పరవాడ, క౦చరపాలె౦, గంభీరం లలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఒక్క ఆటోనగర్ లోనే 12వ౦దల వరకు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ పదివేల మ౦దికి పైగా సిబ్బంది ఉపాధి పొ౦దితున్నారు. అనకాపల్లి సబ్‌ డివిజన్‌లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, ఎలమంచిలి సబ్‌ డివిజన్లకు గురువారం; జోన్‌-2 డివిజన్‌కు శుక్రవారం, జోన్‌-1, జోన్‌-3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లకు శనివారం పవర్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు పవర్ హాలీడే ప్రకటించడం వల్ల పరిశ్రమలు నడిచే పరిస్థితి ఉండదని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలను రోజూ ఒక షిఫ్టులోనే నడపాలి అంటే అల్యూమినియం పరిశ్రమలో మిషన్ హీటెక్కడానికే మూడు గంటలు పైబడి సమయం పడుతుందని తర్వాత ఉత్పత్తి ప్రారంభించినా ఫలితం ఉండదని అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. అలా అని విద్యుత్ కు బదులు ప్రత్యామ్నాయంగా జనరేటర్ల సాయంతో కంపెనీ నిర్వహిద్దామన్న పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో అది సాధ్యం కాదంటున్నారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో ఎమర్జన్సీ లోడ్‌ రిలీఫ్‌ను ఈ నెల 22వ తేదీ వరకు అమలు చేస్తున్నారు. ఆ తరువాత పరిస్థితులను బట్టి మార్పులు, కొనసాగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Google Play Store: ప్లేస్టోర్‌లోని యాప్‌లకు షాకిచ్చిన గూగుల్‌.. అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లపై కీలక నిర్ణయం..!

Book Now Pay Later: ఇప్పుడే బుక్‌ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త సేవలు