Google Play Store: ప్లేస్టోర్‌లోని యాప్‌లకు షాకిచ్చిన గూగుల్‌.. అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లపై కీలక నిర్ణయం..!

Google Play Store: స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఏ చిన్న పని చేసుకోవాలన్న యాప్‌ తప్పనిసరి. అయితే కొన్ని యాప్స్‌ ఫోన్‌లోనే వస్తుంటే..

Google Play Store: ప్లేస్టోర్‌లోని యాప్‌లకు షాకిచ్చిన గూగుల్‌.. అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లపై కీలక నిర్ణయం..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2022 | 8:07 AM

Google Play Store: స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఏ చిన్న పని చేసుకోవాలన్న యాప్‌ తప్పనిసరి. అయితే కొన్ని యాప్స్‌ ఫోన్‌లోనే వస్తుంటే మరి కొన్ని యాప్స్‌ (Apps)మన అవసరానికి తగినట్లుగా ఇన్‌స్టాల్‌ చేసుకుంటాము. యాప్స్‌ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌ (Play Store) ఉండనే ఉంది. ఏ యాప్‌ కావాలన్నా ప్లే స్టోర్‌, యాపిల్‌ నుంచి డౌన్‌లోడ్‌ (Download)చేసుకోవాల్సిందే. వీటిలో కొన్ని యాప్స్‌ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తూ సెక్యూరిటీ పరంగా యూజర్లకు మరింత సేవలను అందిస్తుంటాయి. మరికొన్ని యాప్స్‌లు విడుదలైనప్పటికీ ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. భద్రతా లోపాల కారణంగా సైబర్‌ నేరగాళ్లు సులభంగా యూజర్ల డేటాను సేకరిస్తున్నారు. యాప్స్‌కు అప్‌డేట్‌ లేని కారణంగా నేరగాళ్లకు సులభంగా మారిపోతోంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకునే దిశగా పయనిస్తోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ టార్గెట్‌ లెవల్‌ ఏపీఐ ప్రమాణాలకు అనుగుణంగా విడుదలైన ఏడాదిలోపు అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లను ఇక నుంచి యూజర్ల డౌన్‌లోడ్‌ చేసుకోలేరని వెల్లడించింది. నవంబర్‌ 1, 2022 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు గూగుల్‌ తన డెవలప్‌ కమ్యూనిటీ బ్లాక్‌లో తెలిపింది. ఇక నుంచి గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వచ్చే ప్రతి యాప్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అప్‌డేట్‌ అయినా ఏడాదిలోపు అప్‌డేట్‌ ఇవ్వకుంటే సదరు య ఆప్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉందని గూగుల్‌ స్పష్టం చేసింది.

అయితే గూగుల్‌ ప్రతియేటా కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను విడుదల చేస్తుంది. యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు భద్రతపరంగా ఓఎస్‌ను మరింత మెరుగు పరుస్తుంది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత యూజర్లు సైబర్‌ దాడుల నుంచి రక్షణ పొందామనే ఆలోచనతో ఉంటారు. అయితే ఓఎస్‌ అప్‌డేడ్‌ లేకపోతే సెక్యూరిటీ పరంగా లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో సైబర్‌ నేరగాళ్లు యూజర్ల డేటాను సేకరించేస్తున్నారు. అందుకు భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో విడుదలైన ప్రతి యాప్‌ ఏడాదిలోపు అప్‌డేట్‌ ఇవ్వాల్సిందేనని గూగుల్‌ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Galaxy S20 FE 2022: మరో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసిన సామ్‌సంగ్‌.. అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం..

Wi-Fi Calling: స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై కాలింగ్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేయడం ఎలా..?