Plastic: మానవళిని కబలిస్తోన్న ప్లాస్టిక్‌ భూతం.. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్‌ రేణువుల గుర్తింపు..

Plastic: ప్లాస్టిక్‌ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది. మొన్నటి వరకు...

Plastic: మానవళిని కబలిస్తోన్న ప్లాస్టిక్‌ భూతం.. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్‌ రేణువుల గుర్తింపు..
Plastic In Lungs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2022 | 6:47 AM

Plastic: ప్లాస్టిక్‌ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది. మొన్నటి వరకు సముద్రాలు, నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చాయి. మొన్నటికి మొన్న మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఊపిరితిత్తుల్లో కనుగొన్నారు.

ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హల్‌కు చెందిన హల్‌యార్క్‌ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఊపిరిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. మనిషి గాలి పీల్చుకునే సమయంలో ప్లాస్టిక్‌ రేణువులు లోపలికి ప్రవేశిస్తున్నాయని, అనంతరం అవి ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి. తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు 13 లంగ్‌ టిష్యూ నమూనాలను పరిశీలించారు, ఇందులో 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. ఇప్పటికే రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించిన పరిశోధకలు ఊపిరితిత్తుల్లో కనుగొనడం ఇదే తొలిసారి. ప్లాస్టిక్‌ వాడకానికి అడ్డుకట్ట పడకపోతే భవిష్యత్తుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితితులు చూడాల్సి వస్తాయో అన్న భయాలు మొదలయ్యాయి.

Also Read: Viral Photo: ఈ వ్యక్తి అటు వెళ్తున్నాడా ?.. ఇటువైపు వస్తున్నాడా ?… ముందుగా చూసేదే మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది..

HUL Investment: హిందూస్తాన్‌ యూనిలివర్ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏమిటంటే..

Viral Video: ఇదెక్కడి విచిత్రం.. తలను బొంగరంలా తిప్పేస్తున్న గుడ్లగూబ.. షాక్‏లో జనాలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!