Octopus: అక్టోపస్‌ జీవి గురించి తెలుసా..? దీని గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..!

Octopus: చేపల గురించి కాకుండా సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు.ఆ ఫోటోలోని ఆక్టోపస్‌ని మీరు కూడా చూసి ఉంటారు. రూపానికి..

Octopus: అక్టోపస్‌ జీవి గురించి తెలుసా..? దీని గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 08, 2022 | 4:39 AM

Octopus: చేపల గురించి కాకుండా సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు.ఆ ఫోటోలోని ఆక్టోపస్‌ని మీరు కూడా చూసి ఉంటారు. రూపానికి వింతగా కనిపించే ఈ జీవి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జీవిలో ప్రత్యేక లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ జీవి గురించి ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసుకుందాం.

  1. ఈ జీవిలో మీరు చూసే చేతులు దాని కాళ్ళు కావు. చాలా మంది దాని కాళ్ళు అని అనుకుంటారు. అలాగే ఇది ప్రతి చేతిలో మెదడును కలిగి ఉంటుంది. ఈ జీవికి 9 మెదడులను కలిగి ఉంటుంది.
  2. ఇది ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
  3. దీనికున్న చేతులు ఈ జీవికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ జీవి నుండి అయినా రక్షించడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా సముద్రంలో నివసిస్తుంది.
  4. ఆక్టోపస్ జీవిత కాలం పెద్దగా ఉండదు. దానికి సంబంధించిన జాతులు చాలా వరకు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వాటి జీవితకాలం 6 నెలలు.

(నోట్‌: ఇందులోని అంశాలు సైన్స్‌ నిపుణులు, ఇతర వెబ్‌సైట్ల ఆధారంగా అందించడం జరుగుతుంది.)

ఇవి కూడా చదవండి:

Viral Photo: ఈ వ్యక్తి అటు వెళ్తున్నాడా ?.. ఇటువైపు వస్తున్నాడా ?… ముందుగా చూసేదే మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది..

Viral Video: ఇదేందయ్యా ఇది.. బర్త్‌డే రోజున యువతికి ఇలా షాకిచ్చారు.. వీడియో వైరల్!