Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karma Siddhanta: నీ కోసం 14 ఏళ్ళు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని అడిగిన తల్లి ప్రశ్నకు కృష్ణడు చెప్పిన కర్మ ఫలితం

Karma Siddhanta: హిందూ సనాతన ధర్మం( Hindu Sanatana Dharma) లో కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా.. తప్పు తప్పేనని.. ఇతరులకు చేసిన అనాయ్యం, బాధ ఎన్ని జన్మలైనా..

Karma Siddhanta: నీ కోసం 14 ఏళ్ళు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని అడిగిన తల్లి ప్రశ్నకు కృష్ణడు చెప్పిన కర్మ ఫలితం
Sri Krishna Karma Siddhant
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2022 | 7:15 AM

Karma Siddhanta: హిందూ సనాతన ధర్మం( Hindu Sanatana Dharma) లో కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా.. తప్పు తప్పేనని.. ఇతరులకు చేసిన అనాయ్యం, బాధ ఎన్ని జన్మలైనా తప్పనిసరిగా శిక్షఅనుభవించాలని నమ్ముతారు. అయితే ఇదే కర్మం సిద్ధాంతాన్ని హిందూ మతం నుంచి ఉద్భవించిన బౌద్ధ, జైన, సిక్కు మతాలు కూడా విశ్వసిస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనిషి తాను చేసిన ప్రతి కర్మకు అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాలి. అనుభవిస్తాడు. మంచి చేస్తే.. శుభఫలితాలను, చెడు కర్మలకు చెడు ఫలితాలను అందుకుంటాడు. తాను చేసిన కర్మల అనుగుణంగానే ప్రపంచంలో ప్రతి జీవి పుట్టుక ఉంటుందని.. శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. పుట్టడానికి ముందు ఆ జీవి గత జన్మలో కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. ఇదే విషయాన్నీ శ్రీ కృష్ణుడు తన తల్లి దేవకీ చెప్పిన విషయం గురించి తెలుసుకుందాం..

శ్రీ కృష్ణుడు తన మేనమామ అయిన కంసుడిని సంహరించిన అనంతరం.. జైలులో ఉన్న తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరకు వెళ్ళాడు. తన కొడుకుని చూసిన వెంటనే దేవకీ మాత.. ఆత్రంగా తన మనసులో సందేహాన్ని కొడుకు ముందు ఉంచింది. కృష్ణా.. నువ్వే దేవుడవు.. నీకు అనేక దివ్య శక్తులున్నాయి… అలాంటప్పుడు.. నీ తల్లిదండ్రులైన మమ్మల్ని కంసుడి చెర నుంచి విడిపించడానికి ఇంత కాలం ఎందుకు తీసుకున్నావు. మేము నీ కోసం గత 14 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నామని శ్రీకృష్ణుడిని అడిగింది.

తల్లి దేవకీ సందేహానికి సమాధానం ఇస్తూ.. అమ్మా నేను నిన్ను 14 ఏళ్ళు నిరీక్షింపజేసినందుకు నన్ను క్షమించు.. అయితే ఇది గత జన్మలో నువ్వు చేసిన కర్మకు ఫలితం… నా గత జన్మలో నన్ను పద్నాలుగేళ్ళ అడవికి ఎందుకు పంపావు.? అని అడిగాడు..

కొడుకు అడిగిన ప్రశ్నకు దేవకీ ఆశ్చర్యపడుతూ.. కృష్ణ.. నేను నిన్ను 14 ఏళ్ళు అరణ్యానికి పంపడం ఏమిటి..? ఇది ఎలా సాధ్యం అని .. ఎందుకు ఇలా చెబుతున్నావు అని ప్రశ్నించింది. తల్లి అడిగిన వాటికి శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ.. అమ్మా నీ గత జన్మ నీకు గుర్తు ఉండదు.. కానీ నువ్వు గత జన్మలో కైకవి.. నీ భర్త దశరధుడు.. అనగానే దేవకీ.. అయితే ఇప్పుడు కౌసల్య ఎవరు అని అడిగింది..

తల్లి దేవకీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. గత జన్మలో కౌసల్య.. ఈ జన్మలో యశోద.. అప్పుడు 14 ఏళ్ళు.. అమ్మ ప్రేమను కోల్పోయింది. ఈ జన్మలో అమ్మప్రేమపొందింది అని చెబుతాడు శ్రీకృష్ణుడు.. కనుక ప్రతి జీవి ఎవరు చేసిన కర్మ ఫలాలను వారే భరించారు. దేవతలైనా సరే.. కర్మ ఫలం నుంచి తప్పించుకోలేరని తల్లి దేవకీ . శ్రీకృష్ణుడు చెప్పాడు..

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..