Guntur District: మల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో అపచారం.. క్యాంటిన్‌లో మాంసాహారం కలకలం
Guntur District: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఆలయ క్యాంటింగ్(Canteen) లో మాంసాహారం(Non Veg Food) వండారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో..
Guntur District: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఆలయ క్యాంటింగ్(Canteen) లో మాంసాహారం(Non Veg Food) వండారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. కలకలం రేగింది. ఈ క్యాంటింగ్ లో ఆలయానికి వచ్చే భక్తుల కోసం టీ, టిఫిన్స్ తయారు చేస్తుంటారు. అంతేకాదు ఆలయంలో నిర్వహించే అన్నదానికి కూడా ఈ క్యాంటింగ్ నుంచే ఆహారపదార్ధాలను పంపిస్తారు. అయితే తాజాగా ఈ క్యాటింగ్ లో మాంసాహార వంటలు చేశారు.. ఈ విషయాన్నీ భక్తులు గమనించడం తో వెలుగులోకి వచ్చినది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం సృష్టించింది. ఆలయ క్యాంటిన్ లో.. క్యాంటిన్ నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు. అయితే ఈ క్యాంటిన్ వ్యాపారం నిర్వహించే వ్యక్తికి క్యాంటిన్ నిర్వహణ భక్తులకు అల్బాహారం, అన్నదానం అందించేలా క్యాంటిన్ ను వేలంలో దేవాదాయశాఖ అప్పగించింది. ఓ అధికార పార్టీ నేత ఈ క్యాంటిన్ ను ఇతరుల పేరుతో వేలంలో నిర్వహణ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు వచ్చిన ఓ ఆర్ధర్ లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటిన్ లో మాంసాహారం వండి.. బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నీ గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, ఆలయ అధికారులు స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల చర్యలు.. వీహెచ్ నేతల ఆందోళన:
ఆలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండిన వార్తలు వెలుగులోకి రాగానే ఓ వైపు హిందూ ధార్మిక సంఘాలు ఆందోళకు దిగాయి. మరోవైపు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాంటీన్‌ను అధికాలు సీన్ చేశారు. అంతేకాదు క్యాంటీన్ నిర్వాహకుల లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిర్వాహకుల వివరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు జరుగుతుంటే.. అధికారులు ఏమి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు క్యాంటీన్ టెండర్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయని వీహెచ్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్యమతస్థులు ఎలా ఆలయ క్యాంటీన్ ను నడిపే అవకాశం ఇస్తారంటూ మండిపడుతున్నారు.