Viral Video: ఇదెక్కడి విచిత్రం.. తలను బొంగరంలా తిప్పేస్తున్న గుడ్లగూబ.. షాక్లో జనాలు..
సాధారణంగా జంతువులు.. పక్షులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కుక్క, సింహం నుంచి ఎలుక.. పావురం ఇలా
సాధారణంగా జంతువులు.. పక్షులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కుక్క, సింహం నుంచి ఎలుక.. పావురం ఇలా జంతువులు.. పక్షులు కొన్ని సందర్భాల్లో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఓ గుడ్లగూబ చేస్తున్న పనికి అక్కడున్నవారంతా షాకవుతున్నారు. ఇంతకీ ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? సామాన్యంగా గుడ్లగూబలు తమ తలను పూర్తిగా తలకిందులుగా తిప్పగల సామార్థ్యాన్ని కలిగి ఉంటాయని మీకు తెలుసా?. అవి తమ మెడను 360 డిగ్రీలు తిప్పుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అది వాస్తవం కాదు. వాస్తవానికి రక్త నాళాలు పగలకుండా లేదా స్నాయువులను విరగకుండా మెడను గరిష్టంగా 270 డిగ్రీలు తిప్పగలుగుతాయి. వ్యక్తులు. జంతువులు ఒక వస్తువును చూసేందుకు తమ కళ్లను తిప్పుతారు. గుడ్లగూబలు వాటి తల మొత్తం తిప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి కనుబొమ్మలు తిప్పలేవు. అవి వాటి మెడను సాగదీయాల్సి ఉంటుంది. ఇది అతీంద్రియ ఫీట్. వ్యక్తులు గుడ్లగూబలా తలలు తిప్పితే అవి అన్ని రకాల అంతర్గత రక్తస్రావం ఆగిపోతుంది
తాజాగా ఓ గుడ్లగూబ తన తలను తలకిందులుగా తిప్పుతూ కెమెరాను చూస్తుంది. ఈ వీడియో అమేజింగ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. గుడ్లగూబ తలకిందులుగా తల తిప్పడం చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఆ వీడియోలో ఉన్న గుడ్లగూబను స్నోవీ గుడ్లగూబ అని పిలుస్తారు. ఈ మంచు గుడ్లగూబలు స్వచ్చమైన తెలుపు రంగులో ఉంటాయి. వాటిపై నలుపు లేదా గోధుమ రంగు గుర్తులు ఉంటాయి.
Cute. ?❤? pic.twitter.com/MJvrMkchgi
— Amazing Nature (@AmazingNature00) April 6, 2022
Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..
RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..
Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..