AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్టైలే వేరు.. తనకు నచ్చినట్లు సినిమాలు చేస్తాడు.. నచ్చితేనే తన మూవీస్ చూడండని..

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2022 | 3:19 PM

Share

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్టైలే వేరు.. తనకు నచ్చినట్లు సినిమాలు చేస్తాడు.. నచ్చితేనే తన మూవీస్ చూడండని.. నచ్చకపోతే చూడకండి అంటూ ముక్కుసూటిగా చెప్పేస్తాడు. తనకు నచ్చినట్లు ఉంటారు… ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనను పట్టించుకోరు..సినిమాలేకాదు.. ప్రస్తుత పరిస్థితులపై కూడా వర్మ తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటారు. నిత్యం ఏదో ఒక కాంట్రావర్సితో ఉండే వర్మకు ఇప్పటికీ యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువే. ఈరోజు (ఏప్రిల్ 7న) రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సినీ గేయ రచయిత సిరాశ్రీ ఓ ట్వీట్ చేశారు.

“ఆర్జీవీ సర్ జీ.. సైకిల్ చైనుతొ సినిమా …సైకీనే మార్చివేసి చరితాత్ముండై.. జైకొట్టిన ఛీకొట్టిన.. రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే.. ” అంటూ పద్యంతో వర్మకు శుభాకాంక్షలు చెప్పాడు. దీనిపై వర్మ తనస్టైల్లో స్పందించాడు. “బాగానే ఉంది.. కానీ నన్ను రావణుడితో పోల్చితేనే నాకు మరింత సంతృప్తిగా ఉంటుంది ” అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఆర్జీవీ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. హ్యప్పీ బర్త్ డే అని చెబుదాం అనుకున్నాను కానీ నేను చెప్పినా చెప్పకపోయినా నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉంటావు. పుట్టుక మీద నీకు ఆశ లేదు కాబట్టి బర్తడే విషెస్ నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుడదు నిర్ణయించుకున్నాను.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. కానీ మీ జీవితంలో ఒక్క సంవత్సరం ను ఈ రోజు తో కొల్పోతున్నారు. కానీ నాకు పుట్టినరోజు వేడుకలు నాచ్ఛావు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?

Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..

Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..