RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన డేంజరస్ (మా ఇష్టం) చిత్రం వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్

RGV:  మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..
Rgv
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2022 | 6:22 PM

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన డేంజరస్ (మా ఇష్టం) చిత్రం వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తై రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. థియేటర్లు సహకరించకపోవడంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇవ్వడంతో.. రిలీజ్ పై వెనకడుగు వేశారు వర్మ. ” మా ఇష్టం సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను.. మీ రామ్ గోపాల్ వర్మ” అంటూ ట్వీట్ చేశారు వర్మ.

అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ గురించి వర్మ మాట్లాడుతూ.. మా ఇష్టం అనేది ఓ క్రైమ్ డ్రామా మూవీ అని.. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో చిక్కుకోవడం.. అందులో నుంచి బయటపడే సమయంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేది డేంజరస్ సినిమా అని తెలిపారు వర్మ. ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్‏లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదని. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదని. మొదటిసారి ఇద్దరూ హీరోయిన్స్ మధ్య ప్రేమకథను తనే తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇంతకు ముందుగు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. మరికొన్ని సినిమా థియేటర్స్ కూడా డేంజరస్ మూవీ ప్రదర్శనకు ముందుకు రాలేదట. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఆర్జీవి.

Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?

Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..

Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..