Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి సినిమా నుంచి ఫస్ట్ లిరికల్.. వర్షంలో వెన్నెల సాంగ్ రిలీజ్ అప్పుడే..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య (Naga Sharya) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. వరుడు కావలెను..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య (Naga Sharya) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. వరుడు కావలెను.. లక్ష్య సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి విజయం అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రానికి డైరెక్టర్ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి మొదటి పాట వర్షంలో వెన్నెల రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రేక్షకులని పాటలతో అలరించడానికి సిద్దమౌతుంది. ఈ చిత్రంలో మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఏప్రిల్9న విడుదల కాబోతుంది. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని చిత్రీకరీంచారు. ఈ పాటలో నాగశౌర్య- షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చట గా వుంటుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనుండగా..వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు.
This will amaze you all .. ?
Our First Single #VarshamloVennella Lyrical Video is releasing on April 9th! ??#KrishnaVrindaVihari@ShirleySetia #AnishKrishna @mahathi_sagar #SaiSriram @ira_creations @saregamasouth pic.twitter.com/oA95qm79nM
— Naga Shaurya (@IamNagashaurya) April 7, 2022
Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?
Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..
చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..