Shares: షేర్ల డీలిస్టింగ్ నుంచి పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండటం ఎలా.. పూర్తి వివరాలు..

Shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి.

Shares: షేర్ల డీలిస్టింగ్ నుంచి పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండటం ఎలా.. పూర్తి వివరాలు..
SEBI
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 08, 2022 | 8:30 PM

Shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి. IPO ట్రెండ్ మార్కెట్ లోని కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ IPOల నుంచి మంచి రాబడిని పొందడంతో పెట్టుబడిదారులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి పెట్టుబడిదారుల్లో రవి కుమార్ కూడా ఒకరు. IPOలో పెట్టుబడి పెట్టిన అతను దాని నుంచి చాలా లాభం పొందాడు. అయితే.. తాజాగా వచ్చిన ఒక వార్త అతనిని షాక్‌కి గురి చేసింది. అదేంటంటే.. చాలా సంవత్సరాల క్రితం అతను పెట్టుబడి పెట్టిన ఒక కంపెనీ.. ఇప్పుడు షేర్ మార్కెట్ నుంచి డీలిస్టింగ్ చేయబడటం. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక రవి కుమార్ ఆందోళన చెందుతున్నాడు.

ఇదంతా ఆలోచిస్తూనే షేర్ మార్కెట్‌లో ఎక్స్‌పర్ట్ అయిన తన స్నేహితుడు అతుల్ దగ్గరకు వెళ్లాడు. చింతించటం మానేసి ముందు కాఫీ తాగు నేను ప్రతి విషయాన్నీ నీకు వివరిస్తానని అతుల్ చెప్పాడు. కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎలా లిస్టింగ్ చేయబడతాయో అలాగే ఎక్ఛ్సేంజ్ నుంచి డీలిస్టింగ్ చేయబడతాయని రవితో అన్నాడు అతుల్. ఈ ప్రక్రియ ద్వారా ఎక్స్ఛేంజ్ నుంచి కంపెనీ షేర్లను పూర్తిగా తీసివేయడం లేదా డి-లిస్ట్ చేస్తారు. ఇది వినేందుకు చాలా సీరియస్‌గా, చెడ్డగా అనిపిస్తుంది కానీ.. అసలు విషయం ఏమిటంటే డీలిస్టింగ్ ఎప్పుడూ చెడ్డ విషయం కాదు. వాస్తవానికి ఇలాంటివి జరగటానికి ప్రధాన కారణం సదరు కంపెనీ తన షేర్లను డీలిస్ట్ చేయాలనుకోవాలనుకోవటమే. మరో పద్ధతిలో మార్కెట్ రెగ్యులేటర్ SEBI ద్వారా కంపెనీ బలవంతంగా డి-లిస్ట్ చేయబడినప్పుడు దానిని కంపల్సరీ డీలిస్టింగ్ అని అంటారు. తనకు ఈ విషయం పూర్తిగా అర్థం కాలేదని రవి.. అతుల్ ని అడిగాడు. ఈ విషయంలో చింతించవద్దని తాను పూర్తి వివరాలు తెలియజేస్తానని అతుల్ హామీ ఇచ్చాడు.

ఏదైనా ఒక కంపెనీ తన స్వంత కోరిక మేరకు డీలిస్ట్ అవుతున్నప్పుడు.. షేర్ హోల్డర్ల వద్ద ఉన్న షేర్లను రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియలో పబ్లిక్ షేర్‌హోల్డర్లు బైబ్యాక్ కు సరసమైన ధరను నిర్ణయించవలసిందిగా కంపెనీని కోరతారు.. గరిష్ఠ బిడ్‌తో ఉన్న రేటును బైబ్యాక్ కోసం కట్ ఆఫ్ ధరగా పరిగణిస్తారు. కట్ ఆఫ్ రేట్ నిర్ణయించబడిన తర్వాత.. కంపెనీకి రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. అదేంటంటే.. అంగీకరించండి లేదా దానికి బదులు కౌంటర్ ఆఫర్‌ను ప్రతిపాదించటం. కంపెనీ కట్ ఆఫ్ రేటును ఎంచుకుంటే.. బైబ్యాక్ ప్రక్రియ జరుగుతుంది. పబ్లిక్ షేర్లు బైబ్యాక్ తర్వాత.. కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ 90% లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు మాత్రమే డీలిస్టింగ్ విజయవంతమైనట్లు పరిగణిస్తారు. ఉదాహరణకు 2012లో నిర్మా లిమిటెడ్ కంపెనీ తన షేర్లను మార్కెట్ నుంచి స్వచ్ఛంద డీలిస్టింగ్‌ చేసుకునేందుకు వెళ్లింది. కంపెనీ మైనారిటీ షేర్‌హోల్డర్లు కలిగిఉన్న 18 శాతం వాటాను ఒక్కో షేరుకు 260 రూపాయల రేటుకు కంపెనీ తిరిగి కొనుగోలు చేసింది. కొత్త వాల్యుయేషన్ పొందడానికి FMCG, ఫార్మా, రసాయనాలు, సిమెంట్, ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పవర్ వంటి వివిధ వర్టికల్స్‌ను లిస్ట్ చేయడానికి కంపెనీ ఇలా చేసింది. తరువాత కంపెనీ దాని సిమెంట్ కంపెనీ నువోకో విస్టాస్‌ను ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేసింది. కమ్పల్సరీ డీలిస్టింగ్‌లో కూడా ప్రమోటర్లు పబ్లిక్ షేర్లన్నింటినీ తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇందులో షేర్ల బైబ్యాక్ రేటు రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించబడదు. వాల్యుయేషన్ స్వతంత్ర ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, మోజర్ బేర్ ఇండియాలు అటువంటి డీలిస్టింగ్‌కు ఉదాహరణలు.

డీలిస్టింగ్‌పై ఇన్వెస్టర్ల ప్రతిస్పందన అది ఏ ప్రక్రియలో జరుగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని హెమ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఆస్తా జైన్ చెప్పారు. బలవంతపు డీలిస్టింగ్‌లో పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఎగ్జిట్ ఆఫర్‌ను ఎంచుకోవాలి. మరోవైపు స్వచ్ఛంద డీలిస్టింగ్‌లో కూడా ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా వాటాను విక్రయించకపోతే.. అతను భారీ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒక కంపెనీ బలవంతంగా డి-లిస్ట్ చేయబడితే ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మటమే మంచిది. అయితే స్వచ్ఛందంగా డీలిస్టింగ్ విషయంలో మీకు కంపెనీపై నమ్మకం, దాని భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఉన్నట్లయితేనే.. దానిలో పెట్టుబడిని కొనసాగించాలి. ఒకవేళ భవిష్యత్తులో డీలిస్ట్ అయిన కంపెనీ షేర్లను మీరు అమ్మాలనుకుంటే దానికి సంబంధించిన ప్రక్రియ ఏమిటో కూడా మీరు ముందుగానే తెలుసుకొని ఉండాలి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ లో కమొడిటీస్ ఎందుకుండాలో తెలుసా..

Commodities: కమొడిటీస్ అంటే ఏమిటో తెలుసా? వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!