AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..

ఏపీఎస్ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇంతకాలం కొరియర్ సెంటర్‌కు కానీ.. కార్గో బుక్కింగ్ పాయింట్‌కు వెళ్లి అక్కడ తమ పార్సల్స్..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..
Apsrtc
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2022 | 8:44 PM

Share

ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్(Courier), కార్గో బుకింగ్‌కు(Logistics) అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇంతకాలం కొరియర్ సెంటర్‌కు కానీ.. కార్గో బుక్కింగ్ పాయింట్‌కు వెళ్లి అక్కడ తమ పార్సల్స్ పంపించుకోవల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సులోనే కొరియర్, కార్గో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ముందుగా మీరు కొరియర్ ఎక్కడికైతే పంపించాలో ఆ బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్‌ వద్దే పార్సిల్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ చేసుకున్న తర్వాత వెంటనే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. దీని కోసం టిమ్‌ మెషిన్ల ద్వారా కొరియర్‌ బుకింగ్‌ చేయడం.. రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు ట్రైయినింగ్ ఇస్తున్నారు. కొరియర్‌ బుకింగ్‌ మొత్తాన్ని టికెట్‌ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా విడిగా నమోదు చేస్తారు. కొరియర్‌ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్‌‌ను ప్రయోగాత్మకంగా మొదటగా గుంటూరు జిల్లా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. తర్వాత నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్‌ సేవలు అందిస్తున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఉంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్