AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మంత్రుల రాజీనామాల తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని..

మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రుల రాజీనామాలపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని..

CM Jagan: మంత్రుల రాజీనామాల తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని..
Cm Jagan
Sanjay Kasula
|

Updated on: Apr 07, 2022 | 8:17 PM

Share

ఏపీ మంత్రి వ‌ర్గంలోని మొత్తం 24 మంది మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు(AP Cabinet ministers) రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మ‌ధ్యాహ్నం ఏపీ స‌చివాలయంలో జ‌రిగిన కేబినెట్ భేటీలో జ‌గ‌న్ ఆదేశించగానే.. అంతా ఒక్కసారిగా రాజీనామాలు సమర్పించారు. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రుల రాజీనామాలపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్‌లో అవకాశం ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఇప్పుడు వారంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.

కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించినట్లుగా సామాచారం. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలిపారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ మీరు ఏపదవి ఇచ్చిన చేసేందుకు రెడీగా ఉన్నామని హ్యాపీగానే రిజిగ్నేషన్ ఇచ్చామని చెప్పారు పేర్నినాని. కేబినెట్ భేటీ కూడా నవ్వులు పూయిస్తూ జరిగిందన్నారు.

మంత్రి పదవికి రాజీనామా చేయడంలో కొత్త ఫీల్ అయ్యేది ఏమీ లేదన్నారు తానేటి వనిత. ఇక నుంచి పార్టీ గెలుపుకు కృష్టి చేస్తామని చెప్పారు వనిత.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్