Onions Benefits: వేసవిలో పచ్చిఉల్లితో అనేక లాభాలు.. ఘాటుగా తింటే ఆ సమస్య పరిష్కారం..!

Onions Benefits: ఉల్లిగడ్డలు ప్రతి ఇంట్లో ఉంటాయి. దాదాపు ఇవి లేనిదే ఏ వంట చేయరు. ఉల్లిపాయ కూరల రుచిని మరింత పెంచుతుంది. అయితే వేసవిలో కొంతమంది వీటిని ప

Onions Benefits: వేసవిలో పచ్చిఉల్లితో అనేక లాభాలు.. ఘాటుగా తింటే ఆ సమస్య పరిష్కారం..!
Onions
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 6:40 PM

Onions Benefits: ఉల్లిగడ్డలు ప్రతి ఇంట్లో ఉంటాయి. దాదాపు ఇవి లేనిదే ఏ వంట చేయరు. ఉల్లిపాయ కూరల రుచిని మరింత పెంచుతుంది. అయితే వేసవిలో కొంతమంది వీటిని పచ్చిగా కూడా తింటారు. ఇందులో యాంటీ-అలెర్జీ, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వేసవిలో ఉల్లిపాయ పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉల్లిపాయ మిమ్మల్ని వేడి స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. పచ్చి ఉల్లిపాయ ప్రభావంలో చల్లగా ఉంటుంది. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అధిక వేడి నుంచి రక్షిస్తుంది. అందుకే వేసవిలో ఉల్లిపాయ తింటే మంచిది. ఉల్లిపాయ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1. ఉల్లిపాయ నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే అది దంతాల బ్యాక్టీరియాని, చిగుళ్ళ సమస్యను తొలగిస్తుంది.

2. పీరియడ్స్ సమస్యల నుంచి బయటపడేందుకు ఉల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమయంలో ఉల్లిపాయ తింటే మంచిది.

3. మనం ఉపయోగించే చాలా కూరగాయలలో క్రోమియం అస్సలు ఉండదు. కానీ మీరు ఉల్లిపాయల నుంచి క్రోమియం పొందుతారు. ఇది చక్కెరను నియంత్రించడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది.

4. ఉల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినాలి.

5. ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

6. ఉల్లిపాయ చర్మానికి చాలా మంచిదని చెబుతారు. ఇందులో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

7. వేసవిలో చాలా మందికి రక్తస్రావం సమస్య ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కను ముక్కులో పెట్టుకుని శ్వాస తీసుకుంటే రక్తస్రావం అదుపులో ఉంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!

Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!

Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?