Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!

Spiritual News: కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా భార్య భర్తకి ఎడమ పక్కన ఉండాలని చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారంటే దీని వెనుక ఓ పరమార్థం దాగి ఉంది.

Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!
Wife Right Side Husband
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 11:31 PM

Spiritual News: కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా భార్య భర్తకి ఎడమ పక్కన ఉండాలని చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారంటే దీని వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పురాణాల ప్రకారం మహాశివుడి ఎడమ వైపు నుంచి ఒక స్త్రీ జన్మించినట్లు చెబుతారు. అందుకే భార్యను వామంగి అని పిలుస్తారని గ్రంథాలలో ఉంది. వామంగి అంటే మనిషి శరీరంలో ఎడమ భాగంలో ఉండేదని అర్థం. అందుకే అన్ని శుభ కార్యాలలో భార్యను భర్తకు ఎడమ వైపున కూర్చోబెడతారు. కానీ కొన్ని పనులలో ఆమె కుడి వైపున కూడా కూర్చుంటుంది. అయితే ఇలా కుడివైపున ఎందుకు కూర్చోబెడతారనే దానికి సమాధానం తెలియదు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఈ పనులలో భార్య కుడివైపున కూర్చుంటుంది

కన్యాదానం, వివాహం, యాజ్ఞకర్మ, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన సమయాల్లో భార్య భర్తకి కుడివైపున కూర్చోవాలని శాస్త్రాలలో ఉంది. దీనికి కారణం ఈ పనులన్ని పురుషాధిక్యతగా పరిగణిస్తారు. కాబట్టి భార్యని కుడి వైపున కూర్చోమని చెబుతారు. అయితే భార్య నిద్రించేటప్పుడూ, ఆశీర్వాదం పొందుతున్నప్పుడు, భోజన సమయంలోనూ భర్తకి ఎడమవైపున కూర్చోవాలి. ఎందుకంటే ఈ పనులు స్త్రీ ఆధారితమైనవిగా పరిగణిస్తారు.

భార్యను అర్ధాంగిని అని ఎందుకు అంటారు..?

భార్యని అర్ధాంగి అని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే పెళ్లయిన తర్వాత భార్య తన భర్త జీవితంలోకి ప్రవేశిస్తుంది. సంతోషం, దుఃఖం రెండింటినీ ఆస్వాదిస్తూ అతని జీవితంలోని ప్రతి పరిస్థితిలో భాగమవుతుంది. జీవిత భాగస్వామిగా మారడం ద్వారా ఆమె తన భర్త బాధ్యతలలో పాలు పంచుకొని పూర్తి భక్తితో అతడితో జీవితం గడుపుతుంది. భార్య లేని భర్త జీవితం అసంపూర్ణం. అందుకే మన గ్రంథాలలో ఆమెని అర్ధాంగిని అని అంటారు.

భీష్మ పితామహుడు.. భార్య గురించి ఈ జ్ఞానాన్ని అందించాడు

మహాభారత కాలంలో భీష్మ పితామహుడు భార్య గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. భార్య ఇంటి లక్ష్మి అని, ఆమె వల్ల వంశం వృక్షం పెరుగుతుందని చెప్పాడు. భార్యను ఎప్పుడూ గౌరవించాలని, సంతోషంగా ఉంచాలని అప్పుడే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని బోధించాడు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పురాణాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగింది.

Honda: ద్విచక్ర వాహన ధరలు పెంచిన హోండా.. యాక్టివా, షైన్ కొత్త ధరలు తెలుసుకోండి..!

కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్.. వారికి ఎటువంటి హామీ లేకుండా పది లక్షల వరకూ రుణం!

ఈ రెండు ప్రభుత్వ పథకాలకూ విశేష స్పందన.. ప్రతినెలా పెన్షన్ గ్యారెంటీ!