AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!

Sri Ram Navami 2022: ఏప్రిల్ 2 నుంచి మొదలైన చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగుస్తాయి. నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో కొలుస్తారు. తొమ్మిదో

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!
Sri Ram Navami 2022
uppula Raju
|

Updated on: Apr 09, 2022 | 6:16 PM

Share

Sri Ram Navami 2022: ఏప్రిల్ 2 నుంచి మొదలైన చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగుస్తాయి. నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో కొలుస్తారు. తొమ్మిదో రోజున రామ నవమి అని పిలుస్తారు. దీనిని శ్రీరాముని జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఈ సంవత్సరం రామ నవమి ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ముగుస్తుంది. నవరాత్రులు సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. మార్చి లేదా ఏప్రిల్‌లో చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. అలాగే అక్టోబర్-నవంబర్‌లో దుర్గా నవరాత్రులు నిర్వహిస్తారు. ఇవి దసరాతో ముగుస్తాయి. అయితే నవరాత్రులలో ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

నవరాత్రులలో చేయాల్సిన పనులు

1. అన్ని నవరాత్రి రోజులలో అఖండ దీపాన్ని వెలిగించాలి.

2. ఇది సాధ్యం కాకపోతే పండుగ ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలి.

3. అన్ని నవరాత్రి రోజులలో దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి పఠించాలి.

4. ఉపవాసం ఉన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, గ్రీన్ టీలని తీసుకోవాలి.

5. మీరు పని చేసే వృత్తినిపుణులైతే బాదం, వాల్‌నట్‌లు, పిస్తా వంటి కొన్ని గింజలను తీసుకెళ్లడం మంచిది. పెరుగు, మజ్జిగ, పనీర్, ఇతర మొక్కల ఆహారాల నుంచి ప్రోటీన్ పొందాలని గుర్తుంచుకోండి.

6. నవరాత్రులలో ఎటువంటి తప్పులు చేయకూడదు. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నవరాత్రులలో చేయకూడని పనులు

1. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

2. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం మంచిది కాదు. వీలైతే ఇవి లేకుండా వంటలు వండాలి.

3. నవరాత్రి రోజులలో జుట్టును కత్తిరించుకోవద్దు. షేవింగ్ చేసుకోవద్దు.

4. సాత్విక జీవనశైలిని గడపడానికి ప్రయత్నించండి.

5. పూజ సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్, చెప్పులు-బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు. 6. నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరితోనూ అబద్దం చెప్పొద్దు.

7. నవరాత్రి సమయంలో శారీరక సంబంధాలు మానుకోండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పురాణాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగింది.

Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!

Honda: ద్విచక్ర వాహన ధరలు పెంచిన హోండా.. యాక్టివా, షైన్ కొత్త ధరలు తెలుసుకోండి..!

Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!