Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Vastu Tips: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ హిందువు.. తమ ఇంటిని, ఇంట్లోని వస్తువులను వాస్తు శాస్త్రంలోని...

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!
Money
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2022 | 7:29 PM

Vastu Tips: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ హిందువు.. తమ ఇంటిని, ఇంట్లోని వస్తువులను వాస్తు శాస్త్రంలోని సూచనల మేరకు నిర్మించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు. ఈ వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాలను పాటించడం ద్వారా ప్రక‌ృతి శక్తులను శాంతిపరిచి, సానుకూల దృక్పథం పొందవచ్చనేది విశ్వాసం. ఈ సానుకూల దృక్పథం వ్యక్తులు, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆనందం, ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతుందని పండితులు చెబుతుంటారు. వాస్తును విశ్వసించే చాలా మంది ఈ సూత్రాలను పాటిస్తుంటారు. అయితే, చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. అర్థిక సమస్యలకు సంబంధించిన కారాణాలపై ఆరా తీస్తుంటారు. ఈ నేపథ్యంలో డబ్బు నిల్వ ఉండేందుకు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందేందుకు అవసరమైన టిప్స్‌ను వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అష్ట దిక్కులలో డబ్బును ఏ దిక్కులో ఉంచితే ప్రయోజనం చేరుకుతుందో చెబుతున్నారు. మరి డబ్బును ఏ దిశలో పెడితే ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర దిశలో.. ఉత్తర దిక్కును సంపదల దేవుడుగా పరిగణించబడే కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు దాచే బీరువా, లాకర్ ను ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఉంచాలి. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. సంపదను రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దక్షిణ ముఖం సురక్షితం కాదు.. నగదు దాచిన బీరువా, లాకర్‌ను ఉత్తరం వైపున ఉంచినప్పటికీ, దాని తలుపు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు. సంపదల దేవత అయిన దేవి లక్ష్మి దక్షిణాది నుండి ప్రయాణించి ఉత్తరాన స్థిరపడుతుందని ప్రతీతి. అందుకని, దక్షిణం వైపు డోర్ పెట్టకుండా చూసుకుంటే.. అదృష్టం, శ్రేయస్సు సిద్ధిస్తుంది.

నగదు బాక్స్‌ను తూర్పు దిశలో ఉంచాలి.. ఏదైనా కారణాల చేత.. నగదు పెట్టెను ఉత్తర దిశలో ఉంచలేకపోతే, తూర్పు దిశలో పెట్టవచ్చు. ఇక దుకాణాలోని యజమానులు, క్యాషియర్ నైరుతి దిశలో కూర్చుని ఉంటే గల్లా పెట్టెను వారి ఎడమవైపు, తూర్పు ముఖంగా కూర్చుని ఉంటే వారి కుడి వైపున ఉంచాలి.

నగదు పెట్టెను ఎక్కడ పెట్టకూడదు.. డబ్బును గదిలోని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మూలల్లో అస్సలు పెట్టొద్దు. మీ లాకర్ డోర్ ఉత్తరం వైపు తెరిచి ఉంచేలా చూడండి. దక్షిణం వైపు అస్సలు తెరిచేలా ఉంచొద్దు. ఇది మీ దురదృష్టాన్ని మరింత పెంచుతుంది.

పూజ గదిలో నగదు పెట్టెను అస్సలు పెట్టొద్దు.. వాస్తు ప్రకారం పూజ గదికి దూరంగా నగదు పెట్టెను ఉంచాలి. పూజ గది మీ బెడ్‌రూమ్ లేదా డ్రెస్సింగ్ రూమ్‌కి అటాచ్ చేయబడి ఉంటే.. బీరువా, లాకర్‌ను ఆ గదిలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తం.

మరిన్ని చిట్కాలు.. 1. శుభ్రంగా ఉండే ప్రదేశాలను లక్ష్మీ దేవి ఇష్టపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే, మీరు నగదు దాచే బీరువా, లాకర్ ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోండి. 2. మీ లాకర్, బీరువా తలుపుపై లక్ష్మీ దేవి కూర్చున్న వెండి నాణెన్ని ఉంచండి. 3. ఫైల్స్, పత్రాలలో డబ్బులు అస్సలు ఉంచకూడదు. 4. నగదు పెట్టెను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. కనీసం ఒక రూపాయి నాణెం అయినా ఉండేలా చూసుకోవాలి. 5. ఇంటి చివరి, మొదటి గదిలో నగదు పెట్టెను ఉంచొద్దు. 6. లాకర్ బాక్స్ కిటికీ, వెంటిలేటర్ దగ్గర అస్సలు ఉంచొద్దు. లక్ష్మీ దేవి ఇంటిని విడిచి వెళ్లడానికి ఇది సంకేతం. 7. డబ్బు పెట్టెను, బాగా వెలుతురు, పాజిటివ్ వైబ్స్ ఉన్న స్థలాన్ని ఎంచుకుని ఏర్పాటు చేయాలి.

Also read:

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!

Viral News: బాబోయ్ దెయ్యం.. ఫోన్‌ నుంచి మెసేజ్‌లు పంపుతోంది.. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..!

Ukraine – Russia War: జుట్టు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే కన్నీరు పెడతారు..!