Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!

Viral Video: సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్స్‌, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్‌. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ..

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!
Rapper
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2022 | 6:20 PM

Viral Video: సినీ తారలు, స్పోర్ట్స్‌ స్టార్స్‌, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్‌. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ అభిమానులు రచ్చ చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఓప్పిగ్గా ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు ఇస్తారు.

తాజాగా ఓ అమెరికన్‌ ర్యాపర్‌ అభిమానుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ర్యాపర్‌ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండగా డాబాబీ ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్‌ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ర్యాపర్‌ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ పెరగ్గాలనే చెత్తగా ప్రవర్తిస్తారా? అంటూ తిట్టిపోస్తున్నారు.

View this post on Instagram

A post shared by DJ Akademiks (@akademiks)

Also read:

Viral News: బాబోయ్ దెయ్యం.. ఫోన్‌ నుంచి మెసేజ్‌లు పంపుతోంది.. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..!

Ukraine – Russia War: జుట్టు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే కన్నీరు పెడతారు..!

Viral Video: 60 అడుగుల బ్రిడ్జ్‌ని మాయం చేసిన దొంగలు.. ఎలా దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!