AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine – Russia War: జుట్టు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే కన్నీరు పెడతారు..!

Ukraine - Russia War: గత 45 రోజులు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది.

Ukraine - Russia War: జుట్టు కత్తిరించుకుంటున్న ఉక్రెయిన్‌ అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే కన్నీరు పెడతారు..!
Ukraine Woman
Shiva Prajapati
|

Updated on: Apr 09, 2022 | 4:38 PM

Share

Ukraine – Russia War: గత 45 రోజులు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులకు ఉక్రెయిన్ జనజీవనం అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. ఈ దారుణం ఇలా ఉంటే.. రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళల పట్ల మరింత అరాచకంగా ప్రవర్తి్స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రపంచాన్ని నిర్ఘాంతపరుస్తున్నాయి. రష్యా సైనికులకు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లిపోతున్నారట. ఈ భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్ మహిళలు ఎవరూ చేయని ప్రయత్నం చేస్తున్నారు. అందవిహీనంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట.

ఉక్రెయిన్‌లో అమ్మాయిలు తమ జుట్టు కత్తిరించేసుకుంటున్నారు. అయితే ఫ్యాషన్‌ కోసం కాదు. దీని వెనుక దిగ్భ్రాంతికరమైన కారణం ఉంది. ఇవాన్ కివ్ ప్రాంతంలో టీనేజర్లు అయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై రష్యన్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని అక్కడి డిప్యూటీ మేయర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రష్యన్ల కామవాంఛలకు బలికాకుండా తమను తాము కాపాడుకోవాలని ఉక్రెయిన్ అమ్మాయిలు కోరుకుంటున్నారట. ఆకర్షణీయంగా కనిపిస్తే రష్యన్ సైనికుల కళ్లు పడతాయని భయపడుతున్నారట. అందుకే జుట్టు కత్తిరించుకుంటున్నారట. ఓ గ్రామంలో 15, 16 ఏళ్ల వయసున్న అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురవడంతో అమ్మాయిల్లో భయం మరింత పెరిగిపోయిందట. ‘‘ఓ బేస్ మెంట్‌లో తలదాచుకున్న మహిళలను రష్యన్ సైనికులు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఊహించలేం’’ అంటూ ఆ డిప్యూటీ మేయర్ కన్నీటి పర్యంతమయ్యారు.

Also read:

Viral Video: స్టీల్‌ బ్రిడ్జ్‌ని మాయం చేసిన దొంగలు.. ఎలా దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!

Andhra Pradesh: పత్తికొండ రాజకీయాలను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!