Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!

Andhra Pradesh: దోపిడీ దొంగలు చాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తుంటారు. ఏదైనా ఇంటికి టార్గెట్ చేసుకుంటే.. ఆ ఇంటి వారికి, అటు పోలీసులకు చిక్కకుండా

Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!
Robbery
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2022 | 3:29 PM

Andhra Pradesh: దోపిడీ దొంగలు చాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తుంటారు. ఏదైనా ఇంటికి టార్గెట్ చేసుకుంటే.. ఆ ఇంటి వారికి, అటు పోలీసులకు చిక్కకుండా పక్కా స్కెచ్ వేస్తారు. అనుకున్న పనిని పక్కాగా పూర్తి చేసుకుని జంప్ అవుతుంటారు. అయితే, అన్నివేళలా వారి పని ఈజీ అవదని చెప్పొచ్చు. ఎందుకంటే.. దొంగలకు మించిన తెలివైన వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంటి యజమాని కూడా అంతే. దొంగలను మించి తెలివి ప్రదర్శించి వారికి ఊహించని ఝలక్ ఇచ్చాడు. దాంతో బిత్తరపోవడం ఆ దొంగల వంతు అయ్యింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దోపిడీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పాలపర్రు గ్రామానికి చెందిన ఓ కుటుంబం వేరే ఊరికి వెళ్లింది. అయితే, ఇదే అదునుగా భావించిన దొంగలు.. అర్థరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా కాంపౌండ్‌లోకి దూకారు దొంగలు. ఇంటి తాళం పగలగొపట్టి లూటీ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీకెమెరాలు ఇంటి యాజమాని మొబైల్‌కు అనుసంధానమై ఉందనేది. ఇంట్లోకి దొంగలు ఎంటర్‌ అవడం మొబైల్‌ ఫోన్‌లో చూసిన బాధిత ఇంటి యజమాని, ఇంటి పక్కన వాళ్లకు సమాచారం ఇచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే.. చుట్టుపక్కన జనం అరుస్తూ వచ్చారు. జనాల అలికిడి విని అక్కడి నుంచి జంప్‌ అయ్యారు దొంగలు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Also read:

KVS Admissions 2022-23: కేంద్రీయ విద్యాలయాల్లో 2-10 తరగతుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. చివరితేదీ ఇదే..

RRR Movie: మంచి మనసు చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. అనాథ పిల్లల కోసం స్పెషల్‌ షో..

పొగ మసితో అద్భుత చిత్రాలు !! స్మోక్ ఆర్టిస్ట్ టాలెంట్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!