AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జగన్‌ కొత్త క్యాబినేట్‌లో మళ్లీ ఛాన్స్ దక్కనుందా? కొడాలి నాని ఏమన్నారంటే..

AP  New Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో కొత్త మంత్రిమండలి కొలువుదీరనుంది. ఈసారైనా క్యాబినేట్‌లో తమకు చోటు దక్కుతుందా? అని చాలామంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా..

Andhra Pradesh: జగన్‌ కొత్త క్యాబినేట్‌లో మళ్లీ ఛాన్స్ దక్కనుందా? కొడాలి నాని ఏమన్నారంటే..
Kodali Nani
Basha Shek
|

Updated on: Apr 09, 2022 | 5:39 PM

Share

AP  New Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో కొత్త మంత్రిమండలి కొలువుదీరనుంది. ఈసారైనా క్యాబినేట్‌లో తమకు చోటు దక్కుతుందా? అని చాలామంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా.. ఇప్పటికే రాజీనామా చేసిన మంత్రులు మరోసారి అవకాశం దక్కకపోదా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానికి మరోసారి కొత్త క్యాబినేట్‌లోనూ అవకాశం దక్కుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈవిషయంపై ఆయన టీవీ9తో మాట్లాడారు. ‘జగన్ 2019లోనే మంత్రివర్గ మార్పు మధ్యలో ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో మంత్రివర్గ కూర్పు చేస్తున్నారు. ఎన్నికల కోసమో, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం కాదిది. ఇక మంత్రి కావాలని అందరికీ ఆశ ఉంటుంది. మంత్రిగా కొనసాగింపుపై ముఖ్యమంత్రి నుంచి నాకు ఎలాంటి సంకేతాలు రాలేదు. జగన్ ఏ అవకాశం ఇచ్చినా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తాను. వ్యక్తిగత పనుల కోసమే హైదరాబాద్‌ వచ్చాను’

‘సీఎం జగన్ అన్నట్లు ప్రతిపక్షాలు అన్ని కలిసినా ఆయన వెంట్రుక కూడా పీకలేరు. ఎవరు ఎవరితో వచ్చినా సీఎం జగన్ సింగిల్ గానే వస్తారు. కనీసం ఎమ్మెల్యేలుగా గెలవలేని పవన్, లోకేష్ లు సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ డిక్షనరీ లోనే భయం అనే పదం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ మాకు 160 సీట్లు వస్తాయి. ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేలుగా గెలవలేని పవన్, లోకేష్ లు సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రిగా నేను రాసిన పరీక్షపై సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ అవకాశం వస్తుందో నేను చెప్పలేను. అయితే మంత్రి పదవి ఉన్నా లేకున్నా ఇదే ఫైర్ తో పని చేస్తాను ‘ అని నాని పేర్కొన్నారు.

Also Read: Spiritual: పురాణాల ప్రకారం భార్య భర్తకి ఎడమ పక్కన కూర్చోవాలి.. దీని వెనకున్న పరమార్థం ఏంటో తెలుసా..!

Hair Care: కురుల కోసం ఆలివ్‌ ఆయిల్.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Hair Care: కురుల కోసం ఆలివ్‌ ఆయిల్.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..