Payyavula on CM: ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భాష మాట్లాడితే మంచిది.. వైఎస్ జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల హితవు!
ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వరం పెంచారని తెలుగు దేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Payyavula Kesav fire on CM Jagan: ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) స్వరం పెంచారని తెలుగు దేశం పార్టీ(TDP) నేత పయ్యావుల కేశవ్(Payyavula Kesav) ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకే ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి స్వరం వినిపించడం కరెక్ట్ కాదన్నారు. ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయని తెలిసే జగన్ ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఒక రోడైనా వేశామని జగన్ చెప్పుకోగలరా? అని నిలదీశారు. యువత, మహిళలు, రైతుల జీవితాల్లో జగన్ వెలుగులను పీకేశారన్నారు. అటెన్ష్ కోసమే జగన్ అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మూడేళ్ల అధికారంలో ఏం పీకారో చెప్పాలంటూ పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక దగ్గర నుంచి పోలవరం వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. జగన్ పతనం ప్రారంభమైంది.. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ప్రజల జీవితాల్లో ఏం వెలుగులు నింపారో చెప్పాలన్నారు. రాష్ట్ర నిధులుతో ఒక రోడ్డు వేశామని ప్రభుత్వం చెప్పగలదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుండి గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాడేపల్లి దాటి మొదటిసారి బయటకు వచ్చిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా మాట్లాడుతున్నారన్నారు. సీఎం బాష మార్చుకోకపోతే తొందర్లో మిమ్మల్ని పదవిలో నంచి పీకేస్తారని గుర్తు పెట్టుకోవాలని పయ్యావుల ఫైర్ అయ్యారు.